తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Asus Zenfone 9 । ఇది కాంపాక్ట్ వెర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌, కెమెరా హైలైట్

ASUS Zenfone 9 । ఇది కాంపాక్ట్ వెర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌, కెమెరా హైలైట్

HT Telugu Desk HT Telugu

31 July 2022, 10:18 IST

google News
    • Asus నుంచి Zenfone 9 అనే కాంపాక్ట్ వెర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ప్రీబుకింగ్ కోసం అందుబాటులో ఉన్న ఈ ఫోన్ హైలైట్స్ తెలుసుకోండి.
Asus Zenfone 9
Asus Zenfone 9

Asus Zenfone 9

తైవానీస్ కంపెనీ Asus తాజాగా తమ బ్రాండ్ నుంచి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ASUS Zenfone 9ను విడుదల చేసింది. ఈ ఫోన్ గత ఏడాది విడుదలైన Zenfone కు సక్సెసర్. అయితే పాత ఫోన్ కంటే Zenfone 9 పరిమాణంలో కాస్త చిన్నగా ఉన్నప్పటికీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో దృఢంగా ఉంది. Qualcomm నుంచి తాజా ఫ్లాగ్‌షిప్ చిప్ ఇందులో అందిస్తున్నారు.

Zenfone 9 వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో వచ్చి, అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీ షూటర్ కోసం ఎడమవైపుకి అలైన్ చేసిన్ పంచ్-హోల్‌తో గొరిల్లా గ్లాస్ విక్టస్ షీల్డ్ కలిగిన డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 3.55mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది, ఈ రోజుల్లో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఇది ఒక అసాధారణమైన ఫీచర్.

Zenfone 9లో మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, దీని వెనక కేవలం ప్యానెల్ లో ఇచ్చిన కెమెరా మాడ్యూల్. ఇందులో లెన్స్‌కు బదులుగా మొత్తం కెమెరా మాడ్యూల్ కదులుతుంది.

ఇంకా ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

ASUS Zenfone 9 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 5.9 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే
  • 8GB/16GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP Sony IMX766+ 12MP డ్యుఎల్ కెమెరా సెటప్
  • ముందు భాగంలో 12 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4300 mAh బ్యాటరీ సామర్థ్యం, 30W ఛార్జర్

8 GB RAM, 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర, సుమారు రూ. 64,800/-

ఏసస్ Zenfone 9 మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టార్రీ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతానికి, ZenFone 9 బేస్ వేరియంట్ తైవాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఇతర వేరియంట్‌లు ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధరలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అలాగే నేరుగా భారత మార్కెట్లో విడుదల చేస్తుంది, లేనిది కంపెనీ స్పష్టతనివ్వలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం