Asus ROG Phone 6 | గేమింగ్ కోసం ఏసుస్ రోగ్ సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయి!
06 July 2022, 13:47 IST
- టెక్ దిగ్గజం Asus కంపెనీ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ల ధరలు, విశేషాలు ఇక్కడ చూడండి.
Asus ROG Phone 6
తైవానీస్ PC-మేకర్ Asus తాజాగా ROG ఫోన్ 6, ROG ఫోన్ 6 ప్రోల పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇవి ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌లు. ఈ ROG ఫోన్ 6 సిరీస్ అనేది ఏసుస్ కంపెనీకి చెందిన రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) లైనప్‌లో ఒక భాగం. ఇవి గతేడాది విడుదలైన ROG ఫోన్ 5 సిరీస్‌కు అప్‌గ్రేడేడ్ వెర్షన్. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చాయి.
వేగవంతమైన గేమింగ్ అనుభూతి కోసం 165Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, శక్తివంతమైన చిప్‌సెట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో వస్తున్నాయి. ఇందులోని ప్రత్యేకమైమ కూలింగ్ సిస్టమ్ వేడిని నియంత్రిస్తుంది. ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలదని కంపెనీ పేర్కొంది. మెరుగైన బ్యాటరీతో పాటు బైపాస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ప్లగిన్ చేయనపుడు కూడా ఆడుతున్న గేమ్‌ను యధాస్థానంలో భద్రపరచడానికి ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Asus ROG Phone 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
వెనకవైపు 50.3 MP Sony IMX766+ 13MP +5MP ట్రిపుల్ కెమెరా సెటప్
ముందు భాగంలో 12 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఛార్జర్
8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 71,999/-
Asus ROG Phone 6 Proలో ఇవే ఫీచర్లు ఉండి ర్యామ్, స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఈ ఫోన్ 18 GB RAM, /512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చింది. దీని ధర, రూ. 89,990/-
ఈ ఫోన్లు ఫాంటమ్ బ్లాక్, స్టార్మ్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. కనెక్టివిటీపరంగా 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ v5.2, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, రెండు USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి.