HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Apollo: మహిళల కోసం అపోలో ‘టుగెదర్ ఫర్ హెర్’, క్యాన్సర్ అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం

Apollo: మహిళల కోసం అపోలో ‘టుగెదర్ ఫర్ హెర్’, క్యాన్సర్ అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం

Haritha Chappa HT Telugu

16 March 2024, 19:07 IST

    • Apollo: ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. స్త్రీలలో క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు అపోలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
మహిళల్లో క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలు
మహిళల్లో క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలు

మహిళల్లో క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలు

Apollo: క్యాన్సర్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లు ప్రాథమిక స్థాయిలో బయటపడకుండా, ముదిరిపోయాక బయటపడుతాయి. ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు. మహిళల్లో క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు అపోలో "టుగెదర్ ఫర్ హర్" అనే కాంపెయిన్ ను రూపొందించారు.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన అపోలో వైద్యులు మహిళలు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారత దేశంలోనే తొలిసారిగా "పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్"ను ప్రవేశపెట్టామని వారు చెప్పారు. ఈ సందర్భంగా హోటల్ తాజ్ డెక్కన్‌లో అపోలో ఆసుపత్రి వారు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ విజయ్ కుమార్, IPS హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం , భద్రత ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉంటాయని అన్నారు. సమస్యను ముందస్తుగా గుర్తించడం చాలా అవసరమని, ఇలా చేయడం వల్ల మహిళలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి నియంత్రణ సాధించగలుగుతారని అన్నారు.

వైద్యారోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు మాట్లాడుతూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడం ప్రతి మహిళ హక్కు అని అన్నారు. మహిళలు ఆరోగ్య సేవలు, వనరులను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి తమ వంతు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. చబ్ సంస్థ హెచ్ఆర్ హెడ్ స్వప్న సారిపల్లి మాట్లాడుతూ... వర్క్ ప్లేసులో మహిళలకు అండగా ఉండడం చాలా అవసరమని అన్నారు. ఆరోగ్యవంతమైన మహిళలు బలమైన సమాజాన్ని తయారు చేయగలుగుతారని చెప్పారు.

ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఆనంద శంకర్ జయంత్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ. అందరు తరచూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, స్క్రీనింగ్‌లను క్రమం తప్పకుండా చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని 20 విభిన్న కళాశాలల నుండి ఎంపిక చేసిన విద్యార్ధులు, న్యాయవాదులతో కూడిన "పర్పుల్ క్లిప్ ఛాంపియన్స్ బ్రిగేడ్"ను కూడా ప్రారంభించారు. వీరికి సీనియర్ ఆంకాలజిస్టులు కాన్సర్ ప్రివెన్షన్ పై శిక్షణను అందించారు. ఈ ఛాంపియన్లు కమ్యూనిటీలలో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ... మహిళల్లో మనో ధైర్యాన్ని నింపుతారు.

ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్ వైద్యులు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి డయానా, సర్జికల్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ కనుమూరితో పాటు డైరెక్టర్ డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డిలు పాల్గొన్నారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్