తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ambrane Fitshot Surge Smartwatch Launched

సరసమైన ధర, మెరుగైన ఫీచర్లతో Ambrane Fitshot Surge స్మార్ట్‌వాచ్‌!

HT Telugu Desk HT Telugu

24 March 2022, 18:06 IST

    • మీరు స్మార్ట్‌వాచ్‌లు ఇష్టపడే వారైతే మార్కెట్లోకి ఒక సరికొత్త స్మార్ట్‌వాచ్‌ 'ఫిట్‌షాట్ సర్జ్' పేరుతో విడుదలైంది. దీని ఫీచర్లు ఇలా ఉన్నాయి..
Smartwatch
Smartwatch (twitter)

Smartwatch

టెక్నాలజీ లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'ఆంబ్రేన్' సరికొత్తగా ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ రౌండ్ డిస్‌ప్లేతో రస్ట్ ప్రూఫ్ బాడీని కలిగి ఉంది. ఈ రిస్ట్ వాచ్‌లో గుండె సెన్సార్, SpO2 మానిటర్‌ కూడా ఉంది. రోజ్ పింక్, జేడ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తున్న ఆంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌ ధరను మార్కెట్లో రూ. 1,999/- గా నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

Thursday Motivation: పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, అది మీలో తెలివిని, ధైర్యాన్ని నింపుతుంది

అంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌ల విషయానికి వస్తే.. ఈ వాచ్‌లో 1.28-అంగుళాల వృత్తాకార డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ డిస్‌ప్లేకు స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్ రక్షణ ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ద్వారా SpO2 అంటే హిమోగ్లోబిన్ సరఫరా చేసే ఆక్సిజన్ లెవెల్స్, బీపీ మానిటర్, హార్ట్ బీట్ మానిటర్ తదితర సెన్సార్లు ఉన్నాయి. అలాగే మీరు ఎంత నిద్ర పోయారు, మీ రోజువారీ ఫిట్‌నెస్ కార్యకలాపాలను కూడా ఇది ట్రాక్ చేయగలదు.

ఆంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌లో 8 విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇది రిమోట్ కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ లాంటి నియంత్రణలను కలిగి ఉంది. అలాగే ఇందులోని స్మార్ట్‌వాచ్ థియేటర్ మోడ్‌ సినిమా చూసేటపుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్రైట్నెస్ తగ్గించుకునేందు, వైబ్రేషన్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

కాగా, ఆంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్‌కు మంచి పోటీగా Fire Boltt Ninja 2 స్మార్ట్‌వాచ్‌ అందుబాటులో ఉంది. ఇది రూ. 1,899 ధరకు లభ్యమవుతుంది.