తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Benefits: రోజూ క్యారెట్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Carrot Benefits: రోజూ క్యారెట్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి

28 February 2022, 16:14 IST

google News
    • కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు మీకు ముందుగా లభించే సూచన ఏంటో తెలుసు కదా. ప్రతి రోజూ క్యారెట్ తినండి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని డాక్టర్లే కాదు చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ క్యారెట్ ఒక్క కంటికే కాదు శరీరంలో చాలా భాగాలకు ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో పోషకాల గని అయిన క్యారెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ తింటే కలిగే ప్రయోజనాలు
క్యారెట్ తింటే కలిగే ప్రయోజనాలు (pexels)

క్యారెట్ తింటే కలిగే ప్రయోజనాలు

క్యారెట్ అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా కూరగాయలైతే వండుకొని తినాలి కానీ.. క్యారెట్ అయితే పచ్చిగానే తినొచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. చాలా మంది కూర చేసుకొని తినడం కంటే క్యారెట్ ను పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు. తాజాగా ఉండే క్యారెట్లు తీయగా ఉండి.. శరీరానికి తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.

క్యారెట్.. ఇవీ బెనిఫిట్స్..

  • కళ్ల సమస్యలకు క్యారెట్ తో చెక్ పెట్టొచ్చని అందరికీ తెలుసు. కానీ అదొక్కటే కాదు.. ఈ వెజిటబుల్ మరెన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • ఇప్పటి జీవన విధానం వల్ల చాలా మందికి పొట్ట భాగంలో గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ, అల్సర్ల వంటి సమస్యలు వస్తున్నాయి. క్యారెట్ తినడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు. క్యారెట్లలో ఫైబర్ ఉంటుంది. ఇది అజీర్తికి చక్కటి మందు.
  • ఈ ఫైబరే కొవ్వును కరిగించి అధిక బరువుకు చెక్ పెడుతుంది. బరువు తగ్గాలని అనుకుంటున్న వారు ఈ క్యారెట్ రోజూ తీసుకుంటే మంచిది.
  • ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, బయటి ఆహార పదార్థాలు తినేవారికి కాలేయ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అలాంటి వారు క్యారెట్ తింటే.. అందులోని బీటా కెరోటిన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈ బీటా కెరొటిన్ విటమిన్ ఎగా మారుతుంది. ఇది కాలేయంలోని విష పదార్థాలను పారదోలుతుంది.
  • ఈ విటమిన్ ఎ కంటికీ ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలుసు కదా. పైగా రక్తహీనతతో బాధపడేవాళ్లు కూడా క్యారెట్ తింటే ఆ సమస్యను అధిగమించవచ్చు.
  • శరీరంలోని ఇన్ఫెక్షన్లకు కూడా క్యారెట్ మంచి మందులా పని చేస్తుంది. ఇక చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలకు కూడా ఈ క్యారెట్ చెక్ పెడుతుంది. మీ వయసు 30 దాటితే ప్రతి రోజూ కచ్చితంగా క్యారెట్ తినడం మంచిది.
  • మహిళల కంటే క్యారెట్ వల్ల పురుషులకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్లు, మినరల్స్, కెరోటినాయిడ్స్ వల్ల పురుషుల్లో వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. వీలైనప్పుడల్లా క్యారెట్ జ్యూస్ తీసుకొనే పురుషుల్లో సంతాన సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
  • క్యారెట్ వల్ల అల్సర్ల సమస్య కూడా తగ్గుతుందని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా దీనిని పచ్చిగా తింటే.. నోటి అల్సర్లు తగ్గుతాయి.

తదుపరి వ్యాసం