తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uric Acid: శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రమాదం.. ఇలా నియంత్రించుకోండి

Uric Acid: శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రమాదం.. ఇలా నియంత్రించుకోండి

11 January 2022, 11:27 IST

    • శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌యితే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. ఫలితంగా కీళ్ల‌లో రాళ్లు లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా?
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? (pixabay)

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా?

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపుగా మారతాయి. అయితే ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే శ‌రీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా కొన్ని మూలిక‌ల‌ను వాడ‌వ‌చ్చు.  ఫలితంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

1. పున‌ర్న‌వ: 

ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇది కీళ్ల‌లో వాపుల‌ను త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్‌ను బ‌య‌టకు పంపుతుంది. దీంతో వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. పున‌ర్న‌వ ట్యాబ్లెట్లు, పొడి రూపంలో ల‌భిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో ల‌భ్య‌మ‌వుతుంది. ప్యాక్‌పై సూచించిన విధంగా లేదా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడుకోవాల్సి ఉంటుంది.

2. గుగ్గులు: 

మార్కెట్‌లో గుగ్గులుకు చెందిన ట్యాబ్లెట్లు ల‌భిస్తాయి. ఇవి పెయిన్ కిల్ల‌ర్‌లా ప‌నిచేస్తాయి.  వీటి వల్ల నొప్పి, వాపులు త‌గ్గుతాయి.

3. తిప్ప‌తీగ‌: 

యూరిక్ యాసిడ్‌పై ఇది బాగా ప‌నిచేస్తుంది. శరీరంలో పిత్త దోషాన్ని త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. దీని రసాన్ని రోజూ ఉదయం 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకోవచ్చు.

4. తుంగ ముస్త‌లు: 

గౌట్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఇవి బాగా ప‌నిచేస్తాయి. వీటి పొడిని రాత్రి నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే మ‌రిగించి అనంత‌రం వ‌డ‌క‌ట్టి తాగేయాలి. స‌మ‌స్య త‌గ్గుతుంది.

5. న‌ల్ల కిస్మిస్‌

వీటిని రోజూ నీటిలో నాన‌బెట్టి 10-15 చొప్పున ఉద‌యాన్నే తింటుండాలి. రాత్రి నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం తినాలి. యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

6. వ‌రుణ చూర్ణం 

రాత్రి నొప్పి ఉన్న చోట రాయాలి. నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసి రాయాల్సి ఉంటుంది. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇంట్లో దొరికే వస్తువులతో 

*ఇవి కాకుండా శొంఠి, ప‌సుపుల‌ను నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని కీళ్లపై రాస్తే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

* యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే కనీసం ప్రతి రోజు 10 నుంచి 12 గ్లాస్ ల నీరు తాగాలి. 

* మద్యం, చక్కెరతో చేసిన పదార్థాలకు వీలైనంతా దూరంగా ఉండాలి. ఇక ప్యూరీన్స్‌ ఎక్కువగా ఉండే మాంసం, చికెన్, పప్పుధాన్యాలు వంటి ఆహారాలను కూడా తగ్గించాలి.

* నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ను డౌన్ చేస్తుంది. రోజుకు రెండుసార్లు నిమ్మరసం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

* స్ట్రాబెర్రీలతో పాటు బ్లూ బెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోస్‌ ని కూడా నియంత్రణలో ఉంచుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం