Allam Murabba। ఈ మిఠాయి తింటే దగ్గు, గొంతు నొప్పి కూడా మాయం!
06 November 2022, 17:51 IST
- అల్లం, బెల్లం పానకం చేసి అల్లం మురబ్బా చేస్తే.. రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా Allam Murabba Recipe ఇక్కడ ఉంది చూడండి.
Allam Murabba Recipe
అలం మురబ్బా అని ఇప్పటి తరం పిల్లలకు తెలియకపోయిన 80వ- 90వ దశకం వారికి తినుబండారం తెలిసే ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో, రోడ్లపైన దీనిని అమ్మేవారు. ఇది అల్లంతో చేసిన ఒక చాక్లెట్ లాంటిది. చలికాలంలో స్వీట్ తింటూ కూడా జబ్బు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు అంటే అది అల్లం మురబ్బానే.
మురబ్బా అనేది నైరుతి ఆసియా, ఆగ్నేయ ఐరోపాలలో ఎక్కువగా కనిపించే బెర్రీ, చెర్రీ రకానికి చెందిన ఒక గుజ్జుగల పండు. వీటితో జామ్ లాంటివి చేసేవారు. భారతదేశానికి పరిచయం అయిన తర్వాత ఉసిరి, మామిడివంటి పండ్లతో చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇందులో అల్లం కలపడంతో ఇది అల్లం మిఠాయి, జింజర్ క్యాండీ, అల్లం మురబ్బా పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కేవలం స్వీట్ కోసం మాత్రమే కాకుండా ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అంతే కాదు, అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు కలిగి ఉంది. ఈ మూలంగా అల్లం మురబ్బా తింటే దగ్గు, గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని దీనిని తినిపించేవారు. మరి అల్లం మురబ్బా రెసిపీని మీకు ఇప్పుడు అందిస్తున్నాం. ఇందుకోసం ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Allam Murabba Recipe కోసం కావలసినవి
- అల్లం - 1 కప్పు
- చక్కెర - 2 కప్పులు
- యాలకుల పొడి - చిటికెడు (ఐచ్ఛికం)
- ఉప్పు - చిటికెడు
- నీరు - 1 కప్పు
- నెయ్యి / నూనె - 1 టేబుల్ స్పూన్
అల్లం మురబ్బా రెసిపీ- తయారీ విధానం
- వెడల్పాటి బాటమ్ పాన్ వేడిచేసి, అందులో రెండు కప్పుల బెల్లం, పంచదార వేసి, అవి మునిగేంత సరిపడా నీళ్ళు పోయాలి.
- బెల్లం, పంచదార కరిగి సిరప్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి.
- ఇప్పుడు ఇందులో శుభ్రమైన అల్లం పేస్ట్ లేదా తురిమిన అల్లం వేసి బాగా కలపాలి. అల్లం పొడినైనా వినియోగించవచ్చు.
- ఇందులో యాలకుల పొడి వేసి, చిక్కగా మారేంత వరకు కలుపుతూ ఉండాలి. చిక్కదనం పరీక్ష కోసం ఒక గిన్నె చల్లటి నీటిలో సిరప్ వేసి చూస్తే తెలుస్తుంది.
- అల్లం, బెల్లం కలిసిన పానకం చిక్కగా అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి
- దానిని మీకు కావాలసిన ఆకృతిలో కట్ చేసుకొని 20-30 నిమిషాల పాటు చల్లబరచండి.
అంతే అల్లం మురబ్బా రెడీ అయినట్లే... ఆహా ఓహో అంటూ తింటూ ఆనందించండి.