Okra: బెండకాయ కూర తిన్నాక వీటిని తిన్నారో అలెర్జీలు వచ్చేస్తాయి, జాగ్రత్త
27 November 2024, 9:30 IST
Okra: బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని ఆహారాలతో కలిపి తింటే మాత్రం సమస్యలకు కారణం అవుతుంది. బెండకాయతో చేసిన వంటకాలు తిన్నాక ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకోండి.
బెండకాయ
ఆరోగ్యకరమైన ఆహారాల్లో బెండకాయ ఒకటి. కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బెండకాయ పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. వైద్యులు కూడా బెండకాయను తినమనే చెబుతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం బెండకాయను తినేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న వైద్య విధానం. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం కొన్ని ఆహారాలను బెండకాయలతో కలిపి తినడం పూర్తిగా నిషిద్ధం. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.
బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అనేక అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఇస్తాయి. బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని ఆహారాలతో కలిపి బెండకాయ తింటే, అది హానికరంగా మారుతుంది. కొంతమందికి భోజనంలో రెండు మూడు కూరలు తినే అలవాటు ఉంటుంది. మీరు బెండకాయ కూర తిన్నాక ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలో తెలుసుకోండి.
పాలు
బెండకాయ కూరతో మీరు డిన్నర్ ముగివంచాక పాలు తాగకండి. వాస్తవానికి, బెండకాయ, పాలు రెండింటిలోనూ కాల్షియం ఉంటుంది, కానీ బెండకాయలో కాల్షియంతో పాటు ఆక్సలేట్ కూడా ఉంటుంది. అవి కలిసి కాల్షియం ఆక్సలేట్ ఏర్పడతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీరాళ్లతో బాధపడేవారు బెండకాయ, పాలు కాంబినేషన్ కు ఎంత దూరంగా ఉండే అంత ఉత్తమం.
కాకరకాయ
కాకరకాయ, బెండకాయలను కూడా కలిపి తీసుకోకూడదు. బెండకాయ కూర తిన్నాక కాకర కాయ కూరను ముట్టుకోకండి. రెండింటినీ ఒకదాని తరువాత ఒకటి తింటే జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ రెండు పదార్థాలు కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు బెండకాయ, కాకరకాయను కలిపి తింటే సమస్య తీవ్రంగా మారుతుంది. కాకరకాయ వేడిని కలుగ జేస్తే, బెండకాయ చల్లదనాన్ని ఇస్తుంది. ఇది పొట్టలోని పిహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, విరేచనాలు, కడుపు నొప్పి వస్తాయి.
టీ
ఎంతో మందికి భోజనం చేశాక టీ తాగే అలవాటు ఉంటుంది. మీరు భోజనంలో బెండకాయను తిని ఉంటే ఆ వెంటనే టీ తాగడం మానేయండి. టీలో టానిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి బెండకాయలోను పోషకాలను శరీరం గ్రహిాంచ కుండా టీలోని టానిన్లు ఆటంకం కలిగిస్తాయి.
ముల్లంగి
బెండకాయ తిన్నాక ముల్లంగిని తినకూడదు. మీకు ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే ముల్లంగి, బెండకాయను ఒకే భోజనంలో కలిపి తినకండి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఎసిడిటీ వస్తుంది. నిజానికి ముల్లంగిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య పెరుగుతుంది. అలాంటప్పుడు బెండకాయ, ముల్లంగి కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
మీట్
బెండకాయ, మాంసం ఈ రెండింటి కాంబినేషన్ ఏమాత్రం మంచిది కాదు. ఈ రెండూ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు బెండకాయతో భోజనం చేశాక మాంసం జోలికి వెళ్లకండి. అది మీ జీర్ణక్రియను ప్రభావితం చేసి అనేక రోగాలకు కారణం అవుతుంది.
టాపిక్