Salt and Water: వేడినీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే మీరు ఊహించని ప్రయోజనాలు
13 September 2024, 9:30 IST
- Salt and Water: ఉప్పు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన ఆహారమే. అయినప్పటికీ దాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో ఉప్పును తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గోరువెచ్చటి ఉప్పు నీరు తాగితే ఏం జరుగుతుంది?
ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఉప్పు లేని ఆహారాన్ని తినడం చాలా కష్టం. అలా ఉప్పు అధికంగా తిన్నా ప్రమాదమే. ఉప్పును మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వైద్యులు రోజూ సరైన మోతాదులో ఉప్పు తినాలని సూచిస్తున్నారు. ఆహారంలో అనేక విధాలుగా ఉప్పును కలుపుకుని తింటాము. నిజానికి ఆహారాల్లో ఉప్పును తగ్గించాలి. దానికి బదులు ప్రతిరోజూ ఉదయం నీటిలో ఉప్పు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉప్పు నీరు త్రాగటం వల్ల మీరు ఊహించని ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉప్పు నీటిలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఏదేమైనా ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనం అవసరానికి మించి చాలా తక్కువ నీరు తాగుతుంటాం. అటువంటి పరిస్థితిలో, రోజంతా శరీరం తేమవంతంగా ఉండాలంటే ఉదయం ఉప్పు కలిపిన నీరు తాగడం ఉత్తమ ఎంపిక.
మన శరీరానికి కావాల్సిన కాల్షియం మంచి మొత్తంలో అందాలంటే ఉప్పులో కలిపిన నీటిని తాగడం మంచిది. ఇది ఎముకలను ఆరోగ్యంగా మారుస్తుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు బలపడతాయి. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఉప్పునీరు తాగడం దివ్యౌషధం.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వచ్చి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కిడ్నీ, కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వీటితో పాటు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదయాన్నే క్రమం తప్పకుండా ఉప్పు నీటిని తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు కూడా తగ్గుతాయి.
ఉదయాన్నే ఉప్పు నీరు తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. ఉప్పు నీరు మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఇది శరీరం పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. కడుపులో మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు, ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉన్నవారు రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగాలి. జీర్ణశక్తిని సరిచేసినప్పుడు శరీరంలో మెటబాలిజం పెరిగి ఊబకాయం కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది.