Optical Illusion: ఈ చిత్రంలో విగ్రహాల మధ్య ఒక మనిషి దాక్కున్నాడు, అతడిని పదిసెకన్లలో కనిపెట్టండి
14 November 2024, 8:30 IST
- Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ టీజర్ లాగా ఉపయోగపడతాయి. వ్యక్తిత్వ లక్షణాలను బహిర్గతం చేస్తాయి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్ల్యుషన్‌లో మన మెదడుకు సవాలును విసురుతాయి. అందుకే వీటిని సాధించే వారికి ఎక్కువ తెలివితేటలు ఉండాలి. ఇక్కడ మేము అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అందించాము. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలలోనే ఒక మనిషి కలిసిపోయాడు. ఆ మనిషి ఎక్కడున్నాడో కనిపెట్టి చెప్పడమే మీ పని. ప్రపంచంలో కేవలం రెండు శాతం మంది మాత్రమే అతడిని కనిపెట్టి చెప్పగలిగారు. కాస్త తెలివి ఉపయోగిస్తే మీరు ఆ మనిషిని పట్టేయగలరు.
ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కూడా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ని ఛేదించగలరు. కేవలం పది సెకన్లలోనే మీరు ఆప్టికల్ ఇల్యూషన్ ని చేధిస్తే మీరు చాలా తెలివైన వారి జాబితాలో ఉన్నట్టే. మీ ఐక్యూ పవర్ కూడా ఎక్కువే. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఒప్పుకోవచ్చు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను ప్రపంచంలో ఉన్న వారిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే అతి తక్కువ సమయంలో సాధించగలిగారు. మీరు కాస్త బుర్రకు పదును పెడితే దాన్ని పది సెకన్లలోనే తేల్చేయగలరు.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. మీరు చాలా తెలివైనవారు, ఉన్నత శిఖరాలను అందుకుంటారని అర్థం. ఇక జవాబు విషయానికొస్తే ఈ చిత్రంలో ఉన్న విగ్రహాలన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ ఒక చివర ఒక విగ్రహంలా ఉన్న వ్యక్తి చేతికి గడియారాన్ని పెట్టుకున్నాడు. అతడు సమయాన్ని చూసుకుంటున్నాడు. మిగతా బొమ్మల చేతికి ఎలాంటి గడియారాలు లేవు. అతడే మనిషి. విగ్రహాలకు సమయంతో పనిలేదు, కానీ మనిషికి టైం ఎంత అయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జవాబు చేతికి గడియారం పెట్టుకున్నదే వ్యక్తి.
ఆప్టికల్ ఇల్యూషన్ లో కంటికే కాదు మెదడుకు కూడా పరీక్ష పెడతాయి. మీరు ఏదైనా సాధించాలంటే కళ్ళు మెదడు కలిసి పని చేయాల్సిందే. మీరు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను, బ్రెయిన్ టీజర్లను సాధించడం వల్ల మెదడు పవర్ పెరగడమే కాదు కంటి చూపు కూడా నిశితంగా మారుతుంది. ముఖ్యంగా మెదడు, కళ్ళు కలిసి పని చేయడం ఎలాగో నేర్చుకుంటాయి. ఇలాంటి ఆప్టికల్ ఇల్ల్యుషన్లు, బ్రెయిన్ టీజర్లు ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
వీటిని ప్రతిరోజూ సాధించేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఇలాంటి బ్రెయిన్ టీజర్లను, ఆప్టికల్ ఇల్యూషన్లను అందించడం వల్ల వారి మెదడు సామర్థ్యం పెరుగుతుంది. వారు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. చదువులో కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. దృష్టి సామర్థ్యం కూడా మెరుగవుతుంది.