తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dental Care : పళ్లు నొప్పులు వస్తున్నాయా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

Dental Care : పళ్లు నొప్పులు వస్తున్నాయా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

24 November 2022, 18:37 IST

google News
    • Dental Care : చలికాలంలో దంతాల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఏమైనా తిన్నా, తాగినా పళ్లు జివ్వుమని లాగుతాయి. అయితే వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు. వీటితో మీ దంతారోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. 
దంతాల సంరక్షణ చిట్కాలు
దంతాల సంరక్షణ చిట్కాలు

దంతాల సంరక్షణ చిట్కాలు

Dental Care : చలికాలంలో చాలామందికి పంటి నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చల్లని వాతావరణం మీ చర్మాన్ని పొడిగా చేయడంతో పాటు.. దంత సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చలికాలం రాకముందే దంతాలు సున్నితంగా మారిపోతూ ఉంటాయి. దీనివల్ల పంటినొప్పి.. దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. అయితే చలికాలంలో కూడా మీ పంటిని కాపాడుకోవడానికి, వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి.. మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దంత రక్షణ కోసం.. మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేటెడ్​గా ఉండండి

చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఇండోర్ గాలి కూడా పొడిగా ఉంటుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. లాలాజలం సహజంగా నోటిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుంది. ఈ డీహైడ్రేషన్ తగ్గించడానికి.. ప్రతిరోజూ కనీసం 2 లీటర్ల నీటిని తాగడం చాలా ముఖ్యం. ఇది మీ నోటిని శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది.

చక్కెరను పరిమితం చేయండి

చలికాలంలో వెచ్చగా ఉండటానికి టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తాగేటప్పుడు.. చక్కెరకు చెక్ పెట్టండి. ఎందుకంటే చిగురువాపు, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే చిన్న బ్యాక్టీరియాను చక్కెర ఆకర్షిస్తుంది. కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చక్కెరను తీసుకోవడం మానుకోండి.

బ్రషింగ్ టెక్నిక్‌

మీరు సెన్సిటివ్ దంతాలను కలిగి ఉంటే.. ముఖ్యంగా శీతాకాలంలో, మృదువైన బ్రెజల్స్​తో కూడిన టూత్ బ్రష్‌ని ఎంచుకోండి. ఇది చిగుళ్ల చుట్టూ, మీ దంతాలను మరింత సున్నితంగా బ్రష్ చేయడానికి సహాయం చేస్తుంది. పొటాషియం నైట్రేట్, స్ట్రోంటియం క్లోరైడ్ కలిగిన డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. ఇటువంటి పదార్థాలు పంటి నొప్పిని నిరోధించే చికాకుల నుంచి నరాలను రక్షించడంలో సహాయపడతాయి.

రెగ్యులర్ డెంటల్ చెక్-అప్‌

మీరు మీ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. ప్రతి ఆరు నెలలకోసారి డెంటల్ క్లినిక్‌ని సందర్శించండి. దంత సమస్యలు గుండె జబ్బులు, మధుమేహం, ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వాస్తవం చాలా మందికి తెలియదు.

జలుబు పుండ్లకు ప్రత్యేకమైన కేర్

శీతాకాలపు తీవ్రమైన గాలుల వల్ల జలుబు పుండ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం HSV -1 (హెర్పెస్ సింప్లెక్స్) రియాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి జలుబు పుండ్లు పెరగడం కూడా సాధ్యమే. జలుబు పుండ్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి.. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోండి. ఇది మీ పెదాలను తేమగా ఉంచుతుంది. ఇది కఠినమైన శీతాకాల చలి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జలుబు, ఫ్లూ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్యాలు కూడా వస్తాయి. ఇవి జలుబు పుండ్లకు కూడా కారణమవుతాయి. కాబట్టి మీరు జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నప్పుడు.. మీ వైద్యుడిని సందర్శించి సరైన చికిత్స తీసుకోండి.

ఆమ్లాలకు దూరంగా ఉండండి..

ఆమ్ల ఆహారాలు, పానీయాలు దంతాల బయటి పొరను (ఎనామెల్) మృదువుగా చేస్తాయి. దీనివల్ల దంతక్షయం వస్తుంది. ఆమ్ల ఆహారాలు తిన్న తర్వాత, తాగిన తర్వాత.. నోటిని నీటితో లేదా మౌత్ వాష్‌తో శుభ్రం చేసుకోండి.

మౌత్ గార్డ్ ఉపయోగించండి

క్రీడలలో పాల్గొనేటప్పుడు.. సంభవించే దంతాల గాయాలను నివారించడానికి గమ్‌షీల్డ్.. మౌత్‌గార్డ్‌ను ఉపయోగించండి. ఇవి చలికాలంలో మీ దంతాలు, చిగుళ్లను రక్షించడంలో కూడా సహాయం చేస్తాయి. మీకు మౌత్‌గార్డ్ అవసరమా లేదా అనే విషయం గురించి మీ దంతవైద్యుడిని సంప్రదించండి.

ఈ చిట్కాలన్నింటినీ గుర్తుంచుకోవడం వల్ల శీతాకాలంలో మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు నోటి ఆరోగ్య సమస్యల లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వీలైనంత త్వరగా సమీపంలోని డెంటల్ క్లినిక్‌లో అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం