తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teeth Whitening Tips: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? ఇలా ఈజీగా తొలగించుకోండి!

Teeth Whitening Tips: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? ఇలా ఈజీగా తొలగించుకోండి!

HT Telugu Desk HT Telugu

26 September 2022, 22:36 IST

google News
  • Teeth Whitening Tips: మీ పళ్లు పసుపు రంగులో మారాయా? అయితే ఈ సులభమైన  పరిష్కార మార్గాలు ద్వారా సులభంగా తొలగించుకోండి

Teeth Whitening Tips
Teeth Whitening Tips

Teeth Whitening Tips

అందాన్ని బహిర్గతం చేయడంలో దంతాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి . మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, వారి మొదటి దృష్టి దంతాలపైకే వెళ్తుంది. దంతాలు మీ చిరునవ్వును మరింత ఆకర్షణీయంగా చేస్తాయి, కానీ మీకు పసుపు దంతాలు ఉంటే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పసుపు దంతాలు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకారకాలుగా నివారణ పద్దతులను ఉపయోగిస్తుంటారు. మరికొంత మంది దీనికి ఖరీదైన ఔషధాలు వాడుతుంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే పసుపు పళ్లను వదిలించుకోవడానికి ఎలాంటి పరిష్కారాలు చూద్దాం.

ఉప్పు, ఆవాల నూనె

ఉప్పు, ఆవాల నూనె దంతాలపై పసుపు రంగును తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం, అర టీస్పూన్ ఉప్పుతో కొన్ని చుక్కల ఆవాల నూనె కలపండి. తర్వాత ఈ మిశ్రమంతో దంతాలపై మృదువుగా మసాజ్ చేయండి. ఈ రెమెడీని వారానికి ఒకసారి చేయండి. మీరే తేడాను చూస్తారు

గుడ్డు పెంకు

కోడిగుడ్డు పెంకులు దంతాల పసుపును పోగొట్టడంలో ఉపయోగపడతాయి. దీని కోసం, గుడ్డు ఉపయోగించిన తర్వాత, ఆ పెంకును సరిగ్గా కడిగి, దీంతో మెత్తటి పొడిని సిద్ధం చేయండి. ఈ గుడ్డు పెంకు పొడితో మీ దంతాలను బ్రష్ చేయండి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి.

వంట సోడా

దంతాల పసుపు రంగును నివారించడానికి బ్రష్ చేయడానికి ముందు టూత్‌పేస్ట్‌పై చిటికెడు బేకింగ్ సోడా ఆడ్ చేపి బ్రష్ చేయండి. దీంతో దంతాల మీద పసుపు పొర తొలగిపోతుంది. ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయండి.

స్ట్రాబెర్రీలను ఉపయోగించడం

స్ట్రాబెర్రీలను తినడం వల్ల దంతాల పసుపు రంగు ఈజీగా తొలగించడంలో సహయపడుతుంది. దీని కోసం, స్ట్రాబెర్రీలను చూర్ణం చేసి, వాటిని మీ దంతాల మీద రుద్దండి. తర్వాత బ్రష్‌ని ఉపయోగించి దంతాలను శుభ్రం చేసుకోవాలి. మీ దంతాలను బ్రష్ చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

నిమ్మ పై తొక్క

మీ దంతాలు తెల్లగా, ప్రకాశవంతంగా మారడానికి మీరు నిమ్మ తొక్కను ఉపయోగించవచ్చు ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేస్తే మార్పు వస్తుంది.

వేప కర్ర

దంతాలను శుభ్రం చేయడానికి వేప కర్ర కంటే మెరుగైన ఆప్షన్. రోజూ వేప పుళ్ళతో పళ్లు తోముకోవడం వల్ల దంతాలు మెరుస్తాయి.

నారింజ తొక్క పొడి

నారింజ తొక్క పొడి దంతాల పసుపును తొలగిస్తుంది. దీని కోసం, బ్రష్ చేసిన తర్వాత నారింజ తొక్క పొడితో దంతాలను సున్నితంగా మసాజ్ చేయండి.

తదుపరి వ్యాసం