తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Face Whitening Tips : మెరిసే ముఖం కోసం 7 చిట్కాలు.. ఇంట్లోనే చేసుకోవచ్చు

Face Whitening Tips : మెరిసే ముఖం కోసం 7 చిట్కాలు.. ఇంట్లోనే చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

26 September 2023, 14:00 IST

google News
    • Face Whitening Tips : ప్రతీ స్త్రీ అందమైన, మచ్చలు లేని చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంది. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇంట్లో ఉండేవాటితోనే సహజంగా సౌందర్యాన్ని పొందవచ్చు.
బ్యూటీ టిప్స్
బ్యూటీ టిప్స్ (unsplash)

బ్యూటీ టిప్స్

ఏ బ్యూటీ ప్రొడక్ట్ వాడినా అందులో కొన్ని రకాల కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి. మీ చుట్టు పక్కలే.. సహజంగా ఇంటి నివారణల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. కెమికల్, బ్యూటీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని డ్యామేజ్ చేయడమే కాకుండా, వయసు పైబడిన వారిలాగా కనిపిస్తారు. అందుకే ఫెయిర్ స్కిన్ కోసం హోం రెమెడీస్ ఉపయోగించాలి. ఫెయిర్ ఫేస్ కోసం కొన్ని బెస్ట్ రెమెడీస్ చూద్దాం..

పాలు నిమ్మరసం ఫేస్ ప్యాక్

పాలు, నిమ్మరసంతో తేనె కలిపిన పదార్థాలన్నీ మీ ముఖంపై బాగా పని చేస్తాయి. మెరిసే ముఖాన్ని అందించడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ పాలు, నిమ్మరసం తీసుకోండి. ఒక టీస్పూన్ తేనెను అందులో చేర్చండి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మీకు ఫెయిర్, మచ్చలులేని చర్మం లభిస్తుంది.

ఓట్స్, పెరుగు మాస్క్

ఓట్స్, పెరుగు కలయిక ఫెయిర్ స్కిన్ పొందడానికి బెస్ట్ నేచురల్ రెమెడీగా ఉంటుంది. ఈ మిశ్రమం సన్ టాన్, మచ్చలు వంటి వాటిని త్వరగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఓట్‌ను రాత్రంతా నానబెట్టి, ఆపై దానిని పేస్ట్‌గా మిక్స్ చేసి, పెరుగు కలపాలి. ప్రతిరోజూ ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.

బంగాళదుంప మాస్క్

బంగాళదుంపలోని బ్లీచింగ్ పదార్థాలు ఫెయిర్ స్కిన్ అందించడంలో సహాయపడతాయి. ఒక బంగాళాదుంపను తీసుకుని మెత్తగా చేసి దాని రసాన్ని తీయండి. మీ ముఖం మీద అప్లై చేయండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా ఉపయోగించండి.

అరటి, బాదం నూనె ఫేస్ మాస్క్

అరటిపండు, బాదం నూనె రెండూ బ్యూటీ న్యూట్రీషియన్స్‌తో నిండి ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు మీ చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడతాయి. అరటిపండును తీసుకుని మెత్తగా అయ్యేలా చేయాలి. ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి.

శెనగపిండి, పసుపు మాస్క్

శెనగ పిండి, పసుపు ఫేస్ ప్యాక్ అనేది మంచి బ్యూటీ రెమెడీ. ఒక టీస్పూన్ శెనగపిండి, ఒక టీస్పూన్ పసుపును పాలు లేదా నీటితో కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

బొప్పాయి, తేనె మాస్క్

బొప్పాయిలో చర్మ పునరుద్ధరణ ప్రక్రియలో సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి. సమర్థవంతమైన సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. మీ చర్మాన్ని సన్‌బర్న్ నుండి రక్షిస్తుంది. అరకప్పు బొప్పాయిని మెత్తగా చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

టమోటా, పెరుగు మాస్క్

పెరుగుతో తాజాగా తురిమిన టమోటా మీ ముఖాన్ని తెల్లగా మార్చడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. టమోటా, పెరుగు రెండింటిలో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని ప్రభావవంతంగా కాంతివంతం చేస్తాయి. మంచి, ప్రభావవంతమైన ఫలితం కోసం ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేయండి.

తదుపరి వ్యాసం