Fish Eggs Benefits : చేప గుడ్లు తింటే కలిగే లాభాలు తెలుసా? అస్సలు పడేయకూడదు
25 September 2023, 9:30 IST
- Fish Eggs Benefits : మాంసాహారులకు ఇష్టమైన ఆహారం చేప. చేపలు రుచికరమైనవి మాత్రమే కాకుండా శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. చేపలను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
చేపలు
చేపలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి. చేప గుడ్లు కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయని తెలుసా? అవి తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చేప గుడ్లు తినడం మంచిది. చేపల మాదిరిగానే చేపల గుడ్లు కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. దీన్ని వేయించి తింటే రుచిగా ఉంటుంది. చేప గుడ్లు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
చేపల గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అత్యంత ముఖ్యమైన కొవ్వులు. ఈ రకమైన కొవ్వులు శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడవు. ఈ కొవ్వులు చేపలు చేపల గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేప గుడ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగై మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
పిల్లలలో దృష్టి, కంటి పనితీరు అభివృద్ధికి DHA, EPA అవసరమైన పోషకాలు. ఇది చేపలు, దాని గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చాలా తక్కువగా ఉన్నవారిలో కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చేపలు, గుడ్లు తింటే కళ్లకు మేలు జరుగుతుందని చెబుతారు.
చేపల గుడ్లలో పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడం, వాపును నివారిస్తాయి. చేపలు, చేప గుడ్లు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు చేప గుడ్లు తినాలి. అయితే మితంగా తీసుకోవాలి.
చేప గుడ్లలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు చేప గుడ్లు తీసుకుంటే గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇటీవల చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చేప గుడ్లు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి.
బలమైన రోగనిరోధక వ్యవస్థతో తరచుగా అనారోగ్యాలను నివారించవచ్చు. రోగనిరోధక శక్తిని సాధారణ మార్గాల్లో పెంచుకోవాలనుకుంటే, చేపల గుడ్లను క్రమం తప్పకుండా తినండి. ఎందుకంటే చేపల గుడ్లలో ఉండే ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారిస్తాయి.
విటమిన్ డి, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవన్నీ చేపల గుడ్లలో కనిపిస్తాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే చేప గుడ్లు తినండి. అదేవిధంగా దంతాలు ఎలాంటి సమస్యలు లేకుండా దృఢంగా ఉండాలంటే చేప గుడ్లు ఉత్తమ ఆహారం.