తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Think Positive। ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆరు సూత్రాలు!

Think Positive। ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆరు సూత్రాలు!

HT Telugu Desk HT Telugu

05 August 2023, 11:32 IST

    • Ways to Think Positive: సానుకూలంగా ఉంటే, జీవన నాణ్యత మెరుగుపడుతుంది. శరీర బలం పెరుగుతుంది. గాయాలు లేదా అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవచ్చు. మొత్తంగా మీ ఆయుర్దాయం పెరుగుతుంది. సానుకూలంగా ఎలా ఆలోచించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి
Ways to Think Positive
Ways to Think Positive (istock)

Ways to Think Positive

Think Positive: మనిషి జీవితం అనేది సుదీర్ఘ ప్రయాణం, తన జీవితకాలంలో ఎన్నో సంఘటనలు దాటుకుంటూ వెళ్లాలి. అందులో కొన్ని సంఘటనలు మిమ్మల్ని సంతోషపెట్టేవి అయి ఉండవచ్చు, కొన్ని బాధపెట్టేవి అయి ఉండవచ్చు. కానీ చాలా మంది సంతోషకరమైన క్షణాలను త్వరగా మరిచిపోయి, బాధాకరమైనవే ఎక్కువ కాలం వారితో ఉంచుకుంటారు, వాటిలోనే గడుపుతారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు మరింత పెరుగుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మానసికంగా ఆరోగ్యంగా, శారీరకంగా చురుకుగా ఉండాలంటే సానుకూల ఆలోచనలు చేయాలి, సానుకూల దృక్పథంతో ముందుకుసాగాలి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కొంతమంది జీవితంలో ప్రతికూలతల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతారు. నేను చేయలేను, నావల్ల కాదు అని అనుకుంటారు. కానీ, మరికొందరు ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తారు. ప్రతికూలంగా ఆలోచించే వారి మొఖం ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. సానుకూలంగా ఆలోచించేవారి ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ పోదు.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ప్రజలు చిన్న వయసులోనే గుండెపోటు, స్ట్రోక్, కాలేయం చెడిపోవడం, మదుమేహం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీని ఒక కారణం ప్రతికూల ఆలోచనలు చేయడమే. ప్రతికూల ఆలోచనలతో నిరంతరమైన ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. ఇది ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుం. బదులుగా, సానుకూలంగా ఉంటే, జీవన నాణ్యత మెరుగుపడుతుంది. శరీర బలం పెరుగుతుంది. గాయాలు లేదా అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవచ్చు. మొత్తంగా మీ ఆయుర్దాయం పెరుగుతుంది.

సానుకూలంగా ఎలా ఆలోచించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.

1. ఎల్లప్పుడూ మంచిని కోరండి

మంచిని కోరడంలోనే సానుకూలత ఉంటుంది. ఇంకొకరికి చెడు చేయాలనుకునే వారి మనసులో ఎప్పుడూ చీకటి ఉంటుంది. ఈ క్రమంలో అన్ని చెడు ఆలోచనలే చేస్తారు. ఎల్లప్పుడూ మంచివైపు ఉండండి, మంచి మార్గంలో నడవండి, అదే మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది.

2. కృతజ్ఞతగా ఉండండి

మీకు ఏమీ లేదు అని బాధపడే బదులు, మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండండి. మనిషిగా పుట్టినందుకు కృతజ్ఞతగా ఉండండి. ఇతరులతో మిమ్మల్ని, మీ జీవితాన్ని పోల్చుకోకుండా మీలా ఉండండి, మీతో మీరే పోటీపడుతూ దినదినాభివృద్ధి చెందండి.

3. మంచి ఆలోచనలు రాయండి

ప్రతిరోజూ కొన్ని మంచి ఆలోచలు చేయండి, మంచి పనుల గురించి ఆలోచనలు చేయండి. మీ ఆలోచనలు ఒక పేపర్ పై రాయండి. ఇది మీలో ఆశావాదాన్ని పెంచుతుంది. మీకు క్షణకాలం ఆనందాన్ని కలిగిస్తుంది.

4. నవ్వుతూ ఉండండి

నవ్వు మన ఒత్తిడి, డిప్రెషన్ ను ఒక్కసారిగా మాయం చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు నవ్వడానికి కార్టూన్ చూడండి, కామెడీ సీన్లు చూడండి, జోక్స్ చదవండి, మీరు చదివిన జోక్స్ ఇతరులకు చెప్తూ మీరు నవ్వండి, ఇతరులను నవ్విస్తూ సంతోషంగా ఉండండి.

5. సానుకూల వ్యక్తులతో గడపండి

మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించే వారితో, మంచి మాట్లాడేవారితో మీ సమయాన్ని గడపండి. మీరు సానుకూల జీవితాన్ని గడపవచ్చు.

6. ఆరోగ్యకరమై ఆహారం తినండి

మీరు తినే ఆహారం కూడా మీ ఆలోచనలు, ఆందోళనలకు కారణం అని మీకు తెలుసా? కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆలోచనలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి. తినే ఆహారానికి తగినట్లుగా శారీరక శ్రమ చేయండి.

తదుపరి వ్యాసం