Infections from Toilet Seat। టాయిలెట్ సీటు శుభ్రంగా లేకపోతే, ఈ ఇన్ఫెక్షన్లు సోకుతాయి!
29 July 2023, 10:31 IST
- Infections from Toilet Seat: టాయిలెట్ సీట్ల నుండి అనేక ఇన్ఫెక్షన్‌లు సంక్రమించవచ్చు. మీ టాయిలెట్ సీటు నుండి మీకు సంక్రమించగల కొన్ని ప్రధాన ఇన్‌ఫెక్షన్‌లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Infections from Toilet Seat
Infections from Toilet Seat: వర్షాకాలంలో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటిని కూడా ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్టెంట్ క్లీనర్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇళ్లలో అత్యంత మురికిగా మారే ప్రదేశం ఏదైనా ఉందా అంటే, అవి మన టాయిలెట్స్ అని మనందరికీ తెలుసు, ముఖ్యంగా టాయిలెట్ సీట్లు. నివేదికల ప్రకారం, ఒక టాయిలెట్ సీటు మీద సగటున ఒక అంగుళానికి 3.2 మిలియన్ల హానికర బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు పెరుగుతుంటాయి. అయితే మీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే వీటి సంఖ్య తగ్గుతుంది, ఎలాంటి ప్రమాదం ఉండదు.
టాయిలెట్ సీటును ఒకరు మాత్రమే ఉపయోగిస్తే, ఎప్పటికప్పుడు ఫ్లష్ చేయడంతో పాటు వారానికి ఒకసారి యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో డీప్ క్లీన్ చేయాలని సిఫారసు చేస్తారు. లేదంటే, మన టాయిలెట్ సీట్ల నుండి అనేక ఇన్ఫెక్షన్‌లు సంక్రమించవచ్చు. మీ టాయిలెట్ సీటు నుండి మీకు సంక్రమించగల కొన్ని ప్రధాన ఇన్‌ఫెక్షన్‌లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI)
టాయిలెట్ సీట్ల నుండి సంక్రమించే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్లలో UTI లు ఒకటి. సాధారణంగా మూత్రంలో ఉండే బ్యాక్టీరియా మూత్ర నాళంపై దాడి చేసి ఇన్‌ఫెక్షన్‌కు కారణమైనప్పుడు UTIలు సంభవిస్తాయి. మలద్వారానికి మూత్రనాళం సమీపంలో ఉండటం వల్ల పురుషుల కంటే స్త్రీలు UTIలను పొందే అవకాశం ఎక్కుగా ఉంటుంది. అదనంగా, రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత మీ శరీర భాగాన్ని సరిగ్గా శుభ్రపరుచుకోకపోతే బ్యాక్టీరియా మలద్వారం నుండి మూత్రనాళానికి ప్రయాణించి UTIలకు దారితీయవచ్చు.
దీనివలన తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, దిగువ పొత్తికడుపు నొప్పి, ఇతర సమస్యలు ఉంటాయి. UTIని నివారించడానికి ఉత్తమ మార్గం రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు తుడవడం, వెళ్లిన తర్వాత సబ్బు నీటితో మీ చేతులను కడుక్కోవడం తప్పకుండా చేయాలి.
ఇ కోలి ఇన్ఫెక్షన్లు
E coli అనేది మల పదార్థంలో కనిపించే బ్యాక్టీరియా. టాయిలెట్ సీటుపై మలం సరిగా శుభ్రం చేయని పక్షంలో ఈ కోలి సోకే అవకాశం ఉంది. E coli సంక్రమణ లక్షణాలు చూస్తే పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు ఉంటాయి. E coli ఇన్‌ఫెక్షన్లను మీ బాత్రూమ్‌లోని అన్ని వస్తువులు సరిగ్గా డిసిన్ఫెక్టెంట్ చేయాలి. రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ చేతులను సరిగ్గా కడుక్కోవడం చాలా ముఖ్యం.
సాల్మొనెల్లా అంటువ్యాధులు
సాల్మొనెల్లా అనేది మల పదార్థంలో కనిపించే మరొక రకమైన బ్యాక్టీరియా. టాయిలెట్ సీటుపై మలం సరిగా శుభ్రం చేయని పక్షంలో E coli తో పాటుగా సాల్మొనెల్లా సోకే అవకాశం ఉంది. సాల్మొనెల్లా లక్షణాలు చూస్తే, అతిసారం, కడుపు నొప్పి, జ్వరం వంటివి ఉంటాయి. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మీ బాత్రూమ్‌ను పూర్తిగా క్రిమిసంహారం చేయడంతో పాటు, రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత మీ చేతులను సరిగ్గా కడగడం ముఖ్యం.
లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు)
టాయిలెట్ సీటు నుండి సంక్రమించే అత్యంత సాధారణ STIలలో ఒకటి హెర్పెస్. హెర్పెస్ HSV-2 అనే వైరస్ వల్ల వస్తుంది. ఇదొక అంటువ్యాధి. హెర్పెస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన టాయిలెట్ సీటు మీరు కూడా ఉపయోగించినపుడు సులభంగా ఇది మీ చర్మం ద్వారా సులభంగా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా టాయిలెట్ సీటు నుండి హెర్పెస్ వచ్చే అవకాశం ఉంది. హెర్పెస్ నోటి ద్వారా లేదా జననేంద్రియ సంపర్కం ద్వారా లేదా సెక్స్ టాయ్స్ పంచుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది, కాబట్టి సురక్షితమైన సెక్స్‌ను అభ్యసించడం సహా వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇవే కాకుండా ఇతర STIలు కూడా సంక్రమించవచ్చు.
ఈస్ట్ ఇన్ఫెక్షన్లు
ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు కాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్ వల్ల సంభవిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా లేదా వారి శారీరక ద్రవాలు మీకు అంటుకోవడం ద్వారా సంక్రమించవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు తరచుగా మీరు ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సంక్రమించవచ్చు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మీ శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి, తద్వారా ద్వారా హానికర ఈస్ట్ ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా యోని లేదా వల్వా ప్రాంతం చుట్టూ దురద, మంట లేదా చికాకు ఉంటుంది. యోని నుంచి దుర్గంధంతో కూడిన చిక్కటి తెల్లటి ఉత్సర్గ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లను డాక్టర్ సూచించిన మందులతో చికిత్స చేయవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి, మంచి పరిశుభ్రతను పాటించడంతోపాటు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం, సువాసనగల సబ్బులను నివారించడం చాలా ముఖ్యం.