తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 30th October Episode: భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!

NNS 30th October Episode: భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!

Hari Prasad S HT Telugu

30 October 2024, 6:00 IST

google News
    • NNS 30th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (అక్టోబర్ 30) ఎపిసోడ్లో భాగీ దీక్షకు అరుంధతి ఆత్మే అడ్డు పడేలా చేస్తాడు ఘోర. అది చూసిన గుప్త ఆ బంధనాన్ని చెరిపేయగా.. దీక్షను భాగీ విజయవంతంగా ముగిస్తుంది.
భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!
భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!

భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!

NNS 30th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 30) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. భాగీ చేస్తున్న దీక్షని ఎలాగైనా ఆపేయాలనుకుంటుంది మనోహరి. దీక్షను భగ్నం చేయడానికి ఘోర.. అమర్‌ ఇంటికి వస్తాడు. ఘోరాని చూసిన మనోహరి తిడుతుంది. అమర్‌ చూస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది. ఇంట్లో భోజనాలు చేయడానికి ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా ఆత్మ చేతే ఆపేస్తానంటాడు ఘోర.

భోజనానికి ఎవరూ రాకుండా అడ్డుకున్న ఆరు

ఇవాళ నీకోసం చేస్తున్న అమ్మవారి దీక్షకు అడ్డుపడి కొంచెం పాపం మూటకట్టుకో.. అంటాడు. వద్దు దీక్షకు భంగం కలిగించి నువ్వేం సాధించలేవు. అమ్మవారు చూస్తూ ఊరుకోరు అని ఆరు అనగానే ఘోర మంత్రం చదివి ఆత్మను బయటకు పంపిస్తాడు. గేటు ముందు ఆత్మ నిలబడుతుంది. ఆ ఆత్మను దాటుకని ఎవ్వరూ లోపలకి వెళ్లరు మనోహరి అని చెప్పగానే ఆమె సరేనని లోపలికి వెళ్తుంది.

లోపల భోజనాలు రెడీ చేసి అందరూ అతిథుల కోసం ఎదురుచూస్తుంటారు. భోజనానికి ఎవరూ రారు. బయట గుప్త.. ఘోర చేసిన పని చూసి షాక్‌ అవుతుంటాడు. భోజనానికి వచ్చిన ముత్తైదువలు గేటు దగ్గరకు వచ్చి వెళ్లిపోతుంటారు. అదేంటండి. ఇంటికి వెళ్లి మరీ భోజనానికి పిలిస్తే ఒక్కరూ కూడా రావడం లేదేంటి..? అంటుంది భాగీ. రావడం ఇష్టం లేదేమో.. రారేమో.. అంటుంది మనోహరి. శుభమాని పూజ చేస్తుంటే ఏంటమ్మా ఆ మాటలు.. అని కోప్పడుతుంది నిర్మల.

ఆంటీ నేనేం తప్పుగా అనడం లేదు. పూజను లాస్ట్‌ మినిట్‌ లో అనుకున్నారు అందరికీ లాస్ట్‌ మినిట్‌ లో చెప్పారు. అందుకే రారేమో అన్నాను. అయినా మనసు బాగాలేదని దీక్షలు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలిసి ఈ దీక్ష ఇంతటితో ఆపేస్తే మంచిది అనిపిస్తుంది. ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు. నేను నీ మంచి కోసమే.. అదే ఈ ఇంటి కోసమే చెప్తున్నాను అంటుంది మనోహరి. మనోహరి చెప్తున్నది కూడా నిజమే కదమ్మా.. భోజనానికి ఎవ్వరూ రాకపోతే ఇంటికి అరిష్టమేమో.. అంటుంది నిర్మల. మిస్సమ్మ నువ్వేం బాధపడకు. నువ్వు ఎవరెవరిని పిలిచావో వాళ్లను నేను వెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను అని రాథోడ్ వెళ్లిపోతాడు.

ఘోర బంధనాన్ని చెరిపేసిన గుప్త

భాగీ అమ్మవారి దగ్గరకు వెళ్లి బాధగా ప్రార్థిస్తుంది. భాగీ పక్కన అమర్‌ పిల్లలు కూడా వచ్చి కూర్చుని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. మిస్సమ్మ మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఈ దీక్ష పూర్తి అవ్వడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అంటాడు శివరామ్​. జగన్నాథ కళ్ల ముందే ఇంత ఘోరమూ ఇంత అన్యాయమూ జరగుతుంటే నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఈ ఒక్కసారి ఈ ఘోరాన్ని ఆపే శక్తిని ఇవ్వు జగన్నాథ అని గుప్త కోరుకోగానే దేవుడు గుప్తకు శక్తులు ఇస్తాడు.

లోపల అందరూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. తనకు వచ్చిన శక్తులతో ఘోర వేసిన బంధనాన్ని పటాపంచలు చేసి గుప్త లోపలికి వెళ్తాడు. లోపల మనోహరి భాగీని చులకనగా మాట్లాడుతుంది. దండం పెట్టుకున్నా.. దయ చూపించమని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆంటీ ఇంకా ఎంత సేపని ఇలా ఉంటాము. వెంటనే దీక్షను విరమించడం బెటర్‌ అని మనోహరి చెప్పగానే అందరూ బాధగా చూస్తుంటారు. ఇంతలో గుప్త వెనకాల ముత్తైదువలు వస్తుంటారు. గుప్త మాయం అయిపోతాడు.

షాక్‌లో మనోహరి

ఇంట్లోకి వస్తున్న ముత్తైదువులకు బయటకు వెళ్లి కాళ్లకు పసుపురాసి లోపలికి తీసుకెళ్తుంది. మరోవైపు లోపల కూరల్లో ఉప్పు ఎక్కువగా కలుపుతుంది మనోహరి. అందరూ లోపలికి వచ్చి భోజనం చేస్తుంటారు. మొదటగా భోజనం చేసిన ఆవిడ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని అదో రకంగా చూస్తుంది. ఏంటి బామ్మగారు ముద్ద నోట్లో పెట్టగానే ముఖం అలా పెట్టారు. ఏం బాలేవా..? అంటుంది మనోహరి.

అన్ని చక్కగా సరిపోయాయి అమ్మా.. ఇంత చక్కగా కుదిరిన వంటను ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు ఏ కోరికతో దీక్ష చేపట్టావో తెలియదు కానీ అది మనఃస్పూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను అంటుంది ఆవిడ. మానవునికి మాధవుడు తోడైతే ఎలా ఉంటుందో ఈ బాలికకు భోధపడుతుందని నేను అనుకుంటున్నాను అంటాడు గుప్త.

అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. భాగీ దీక్ష భగ్నం చేయడానికి మనోహరి ఏం చేయబోతోంది? ఘోర బంధీగా ఉన్న ఆరు ఆత్మ ఎలా బయటపడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 30న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం