NNS 29th October Episode: దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!-zee telugu serial nindu noorella saavasam today 29th october episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 29th October Episode: దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!

NNS 29th October Episode: దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!

Hari Prasad S HT Telugu
Oct 29, 2024 06:00 AM IST

NNS 29th October Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అమర్, భాగీ, పిల్లల దీక్షతో ఆరు ఆత్మ సీసా నుంచి బయటకు రాగా.. అటు ఆమె ఆత్మ గురించి తెలుసుకుంటారు అమర్. తర్వాత ఏం జరిగిందంటే?

దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!
దీక్షతో ఆరుకి విముక్తి.. ఆత్మ గురించి తెలుసుకున్న అమర్​.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​​!

NNS 29th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 29) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరిని కూడా దీక్ష చేయమంటుంది భాగీ. తాను దీక్ష చేయకూడదు, చేయలేనంటుంది మనోహరి. అదేంటమ్మా.. అలా మాట్లాడతావు. దేవుడి దగ్గర భక్తితో మాట్లాడాలి అంటుంది నిర్మల. దేవుడంటే భయం ఉంటేనే కదా అత్తయ్యా భక్తి వచ్చేది అంటుంది భాగీ.

ఆరు ఆత్మ బయటకు..

అయ్యో బాలిక ఆత్మను బంధించినచో అంతా అయిపోయిందని సంతోషపడుతున్నారా. ఈ కుటుంబం దీక్ష చేసి ఆ బాలికను కాపాడతారు అంటాడు గుప్త. లోపల అందరూ పూజ చేస్తుంటారు. ఘోర మళ్లీ పూజకు అంతా సిద్దం చేసుకుంటాడు. మనోహరి దీక్ష ఆపించిన వెంటనే మనోహరికి సాయం చేసి దేవాను కలిసి మళ్లీ శక్తులు పొందాలి. ఏంటి ఆత్మ దీక్ష నిన్ను కాపాడుతుందని ఆనంద పడుతున్నావా? నువ్వు నా చేతుల్లోంచి ఎప్పటికీ తప్పించుకోలేవు అంటాడు ఘోరా.

అమర్‌ ఇంట్లోంచి అమ్మవారి విగ్రహం నుంచి ఒక శక్తి ఘోర దగ్గరకు వెళ్లి సీసాలో ఉన్న ఆరు ఆత్మను బయటకు పంపించి వేస్తుంది. ఆత్మ నా పర్మిషన్‌ లేకుండా బయటకు ఎందుకు వచ్చింది. అని ఘోరా అరుస్తుంటే.. నీ బంధనం బలహీనపడుతుంది ఘోర అంటాడు గుప్త. ఎవరు.. ఎవరది.. కనిపించండి ఓహో గుప్తానా..? అంటాడు ఘోరా.

మళ్లీ సీసాలో బంధీగా ఆరు

గుప్త గారు నేను ఇక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పారిపోలేకపోతున్నాను కాపాడండి అంటుంది అరుంధతి. నిన్నెవ్వరూ విడిపించలేరు. నువ్వు బంధీగా ఉంది ఈ ఘోర దగ్గర. ఏదో నీ అదృష్టం బాగుండి సీసాలోంచి బయటకు వచ్చావు. నీ చుట్టు ఉంది నా బంధనం. నిన్ను ఆడించేది నా తంత్రం. గుప్తగారిని నానుంచి కాపాడి తీసుకెళమను అంటాడు ఘోరా.

గుప్త గారు నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా? నన్ను కాపాడి తీసుకెళ్లండి అంటుంది ఆరు. ఏంటి ఆత్మ నీ గుప్తుల వారు ఎప్పుడు తీసుకెళ్తారంట అంటాడు ఘోర. అతను చెప్పింది నిజం బాలిక నేను నిన్ను కాపాడి తీసుకెళ్లలేను. ఎందుకంటే అది నా కర్తవ్యం కాదు కనక. నిన్ను కాపాడుటకు నీ కుంటుంబం మొత్తం కష్టపడుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ పతి దేవుడి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ దీక్ష చేస్తున్నారు అంటాడు ఘోర.

లేదు.. ఇది నిజం కాదు అంటాడు ఘోర. మాటలకే ఇటులవుతున్నావు. నేను చూపించునది చూస్తే ఏమవుతావో..అంటూ గుప్త మంత్రించి అమర్‌ ఇంట్లో జరిగే పూజను ఘోర, ఆరుకు చూపిస్తాడు. ఇంతలో ఘోర మరో మంత్రం చదివి మళ్లీ ఆరును సీసాలో బంధించి తీసుకుని వెళ్తాడు.

ఎమోషనల్ అయిన రామ్మూర్తి

పూజ పూర్తి చేసిన భాగీ అందరికీ హారతి ఇస్తుంది. అందరూ సూర్యాస్తమయం అయ్యే వరకు ఏమీ తినకూడదు. సాయంత్రం పూజ అయ్యాక కొంత మందికి అన్నం పెట్టాక అప్పుడు మనం తినాలి అంటుంది. బాబు గారు నా కోసం మీరంతా దీక్ష చేశారు. చాలా సంతోషంగా ఉంది అంటాడు రామ్మూర్తి. ఇష్టమైన వాళ్ల కోసం చేసినప్పుడు అది బాధ అనిపించదు అండి అంటాడు అమర్​.

చెప్పకూడదు అని కాదండి. చెప్పి బాధపెట్టడం ఇష్టం లేక అంటుంది భాగీ. అవును బాబు.. కనిపించని కూతురుకి ఏదో కష్టం వచ్చిందని భయపడి.. బాధపడి ఏదో చెప్పకూడదు అని చెప్పలేదు అంటాడు రామ్మూర్తి. నాకు నాన్నకు ఒకటే సారి ఎందుకో భయమూ బాధ వచ్చాయి. కంటి ముందు అందరూ బాగానే ఉన్నారు. కానీ కంటికి కనిపించని అక్కకు ఏమైనా అవుతుందేమోనని ఆ తల్లిని అక్కకు తోడుగా ఉండమని ఈ దీక్ష చేస్తున్నాం అంటుంది భాగీ.

అమర్ ఇంటికి ఘోర

మిస్సమ్మ మీ అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. మీరు ఉండగా తనకేమీ కాదు అంటూ మాట్లాతుండగా అమర్‌ బయటకు వెళ్తాడు. ఘోర గురించి.. ఆరు గురించి ఆలోచిస్తాడు. రాథోడ్‌ వస్తాడు. చనిపోయిన మేడం కోసం వీళ్లు పడుతున్న బాధ చూసి మీరు బాధపడుతున్నారా? సార్ అని అడుగుతాడు. అసలు ప్రాణాలతో లేని ఆరుకు కష్టమొచ్చిందని వీళ్లకు ఎందుకు అనిపించింది రాథోడ్‌. ఆ పకీర్‌ కూడా నిన్న మాట్లాడిన మాటలు గుర్తున్నాయా..? ఇంటికొచ్చిన స్వామి అస్తికలు గంగలో కలిపే వరకు ఆత్మ పరమాత్మలో కలవదు అని చెప్తారు. పకీర్‌ చెప్పిన దాని ప్రకారం నాకు ముఖ్యమైనది వాడు తీసుకెళ్లాడు అని చెప్పాడు. నాకు ముఖ్యమైనది ఏంటి..? అంటాడు అమర్​. అరుంధతి మేడం సార్‌.. అంటాడు రాథోడ్.

వాడు తీసుకెళ్లింది ఆరునా..? ఆరు ప్రాణాలతో లేదు..? అంటే వాడు తీసుకెళ్లింది ఆరు ఆత్మనా..? నిజంగానే ఆరు ఆత్మ ఇక్కడే ఉందా? నిజమా రాథోడ్‌ ఇది సాధ్యమా..? అని అమర్‌ ఎమోషనల్‌ గా అడగ్గానే రాథోడ్‌ తనకు బాల్‌ తిరిగి వచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. అమర్‌ కూడా ఆరు తన దగ్గరే ఉన్నట్టు ఫీలయిన సందర్భాలు గుర్తు చేసుకుంటాడు.

తర్వాత ఘోర.. అమర్‌ ఇంటికి వస్తాడు. మనోహరి తిడుతుంది. అమర్‌ చూస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది. భోజనాలు చేయడానికి ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా చేస్తానని అంటాడు ఘోర. దీక్ష భగ్నం చేయడానికి ఘోర ఏం చేయబోతున్నాడు? అమర్​ ఆరు ఆత్మని విడిపిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner