తెలుగు న్యూస్  /  Entertainment  /  Yashoda Twitter Review Says This Emotional Thriller Is A Blockbuster

Yashoda Twitter Review: ఎమోషనల్‌ థ్రిల్లర్‌.. సమంత మూవీకి పాజిటివ్‌ రివ్యూలు

HT Telugu Desk HT Telugu

11 November 2022, 10:11 IST

    • Yashoda Twitter Review: ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అంటూ సమంత యశోద మూవీకి పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. యూఎస్‌ ప్రీమియర్‌ షోలు చూసిన వాళ్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయాన్నే స్పెషల్‌ షోలు చూసిన ఫ్యాన్స్‌ ట్విటర్‌లో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
యశోదలో సమంత
యశోదలో సమంత (Twitter)

యశోదలో సమంత

Yashoda Twitter Review: లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న సమంత లేటెస్ట్‌ మూవీ యశోద. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయినా కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు, పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద మూవీ చూసిన కొందరు ఫ్యాన్స్‌ ట్విటర్‌లో పాజిటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

DeAr OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డియర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

ఓ పెద్ద హీరో మూవీ రిలీజైనప్పుడు ఉండే హడావిడే ఇప్పుడూ కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచీ ట్విటర్‌లో యశోద ట్రెండింగ్‌లో ఉంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ముఖ్యంగా సమంత నటనకు ఫిదా అవుతున్నారు. ఇదొక ఎమోషనల్‌ థ్రిల్లర్‌ అంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఇక మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా యశోదకు ప్లస్‌ అయినట్లు చెప్పారు.

ప్రీ ఇంటర్వెల్‌, ఇంటర్వెల్‌ ట్విస్టులు బాగున్నాయంటూ మరో ట్విటర్‌ యూజర్‌ కామెంట్‌ చేశారు. సినిమా మొత్తాన్ని సమంత తన భుజాలపై మోసిందంటూ ఓ యూజర్‌ అభినందించారు. అదే సమయంలో మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పిన సమంత త్వరగా కోలుకోవాలని కూడా పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు.

అటు మూవీ రిలీజ్‌కు ఒక రోజు ముందు సమంత కూడా తాను కాస్త ఆందోళనగా ఉన్నట్లు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఆమె తన ఫీలింగ్స్‌ను పంచుకుంది. "ఇంకా ఒక్క రోజే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. ఇదే సమయంలో ఉత్కంఠగానూ ఉంది. మీ అందరికీ యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మా డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీ, నటుల నుంచి సానుకూలత కనిపిస్తోంది. రేపు విడుదల కానున్న సినిమాపై వారు బాగా నమ్మకంగా ఉన్నారు. సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

అయితే సినిమాకు ఉదయం నుంచి వస్తున్న పాజిటివ్‌ రివ్యూలతో మూవీ మేకర్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత పబ్లిక్‌ టాక్‌లోనూ యశోదకు పాజిటివ్‌ రివ్యూలే వచ్చాయి. సమంత నటన అత్యద్భుతం అంటూ ఆమెను ఆకాశానికెత్తారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.