Yash Toxic Movie Announcement: అఫీషియల్ - ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్‌తో యశ్ యాక్షన్ మూవీ - వెరైటీ టైటిల్ ఫిక్స్
08 December 2023, 10:48 IST
Yash Toxic Movie: కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నెక్స్ట్ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
యశ్
Yash Toxic Movie:కేజీఎఫ్ 2 తర్వాత యశ్ చేయబోయే సినిమా ఏమిటనే సస్పెన్స్‌కు దాదాపు ఏడాదిన్నర తర్వాత తెరపడింది. అతడి నెక్స్ట్ సినిమాపై శుక్రవారం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టాక్సిక్ మూవీకి మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనుంది.
టైటిల్ అనౌన్స్‌మెంట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జోకర్ గెటప్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది. వీడియో చివరలో కౌబాయ్ లుక్‌లో యశ్ కనిపిస్తోన్నాడు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టాక్సిక్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. యశ్ హీరోగా నటిస్తోన్న 19వ సినిమా ఇది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలుగా నిలిచాయి.
మరోవైపు మలయాళంలో అవార్డు విన్నింగ్ సినిమాలతో గీతూ మోహన్ దాస్ ఫేమస్ అయ్యారు. ఆమె దర్శకత్వం వహించిన లయర్ డైస్ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. కానీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన గీతూ మోహన్ దాస్ ఆ తర్వాత దర్శకురాలిగా మారింది.