HT Movie Announcement: హెచ్‌టీ నిర్మాణంలో బాలీవుడ్ చిత్రం.. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్లతో మూవీ
07 December 2022, 10:20 IST
- HT Movie Announcement: హెచ్‌టీ కంటెంట్ స్టూడియో నిర్మాణంలో ఓ బాలీవుడ్ చిత్రం పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు లాంటి భారీ తారాగణం నటిస్తోంది. అనిరుద్ధ రాయ్ చౌదరీ దర్శకత్వం వహిస్తున్నారు.
హెచ్‌టీ నిర్మాణంలో అనిరుద్ధ రాయ్ చౌదరీ మూవీ
HT Movie Announcement: హిందుస్థాన్ టైమ్స్ గ్రూపునకు చెందిన హెచ్‌టీ కంటెంట్ స్టూడియో నిర్మాణంలో ఓ బాలీవుడ్ ఫిల్మ్ తెరకెక్కనుంది. విజ్ ఫిల్మ్స్ , కేవీఎన్ సంస్థలతో సంయుక్తంగా హెచ్‌టీ ఈ సినిమాను రూపొందించనుంది. పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు లాంటి అవార్డు విన్నింగ్ యాక్టర్లు ఇందులో నటించనున్నారు. బుధవారం నాడు అధికారికంగా ఈ సినిమా లాంచ్ అయింది. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాకు అనిరుద్ధ రాయ్ చౌదరీ దర్శకత్వం వహించనున్నారు.
ఈ నెల నుంచే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ముంబయి, కోల్‌కతా లాంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇప్పటికే షెడ్యూల్ కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కునుంది. కలహాలతో సతమతమవుతున్న ఓ కుటుంబం సంఘర్షణలను హార్ట్ టచింగ్‌తో రూపొందించనున్నారు.
ఈ సినిమా గురించి హెచ్‌టీ కంటెంట్ స్టూడియో సీఈఓ మహేష్ రామనాథన్ మాట్లాడుతూ.. "సామాజిక ఇతివృత్తాలను అన్వేషించి తెరకెక్కించడంలో అనిరుద్ధ రాయ్ చౌదరీ ముందుంటారు. పెయిన్‌ఫుల్ మెసేజ్‌ను ప్రభావవంతమైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పంకజ్ త్రిపాఠి, పార్వతి లాంటి అవార్డు విన్నింగ్ యాక్టర్లు ఇందులో నటించనున్నారు. హెచ్‌టీ కంటెంట్ స్టూడియో.. విజ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మాణంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. 12 జాతీయ పురస్కారాలను గెలుచుకున్న టీమ్‌తో మేము పనిచేయబోతున్నాం. కాబట్టి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అనుకుంటున్నాం." అని ఆయన అన్నారు.
మరో నిర్మాత, విజ్ ఫిల్మ్స్ అధినేత విరాఫ్ సర్కార్ మాట్లాడుతూ.. "మల్టీ అవార్డు విన్నింగ్ క్యాస్ట్‌తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. హెచ్‌టీ కంటెంట్ స్టూడియోతో భాగస్వాములవడం సంతోషంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. విజ్ ఫిల్మ్స్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు భవిష్యత్తులో వస్తాయి. కొత్తగా చిత్రసీమలో మొదలుపెట్టిన ప్రయాణానికి చెప్పలేని ఆనందంగా ఉన్నాం." అని విరాఫ్ సర్కార్ అన్నారు.
డైరెక్టర్ అనిరుద్ధ మాట్లాడుతూ.. "ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అసమానతలను ఎదుర్కొన్న వ్యక్తులు ఓ బలమైన యూనిట్‌గా ఏర్పడడానికి ఎలా కలిసి వస్తారనేది చిత్రకథాంశం. విజ్ ఫిల్మ్స్, హెచ్‌టీ కంటెంట్ పనిచేయబోతుండటం సంతోషంగా ఉంది." అని ఆయన అన్నారు.
అనిరుద్ధ రాయ్ చౌదరీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు, సంజనా సింగ్, జయ అహసాన్, దిలీప్ శంకర్, పరేష్ పహూజా, వరుణ్ బుద్ధదేవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశముంది.
టాపిక్