తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari Twitter Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ట్విట్ట‌ర్ రివ్యూ - విశ్వ‌క్ సేన్ మాస్ ఫీస్ట్‌

Gangs of Godavari Twitter Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ట్విట్ట‌ర్ రివ్యూ - విశ్వ‌క్ సేన్ మాస్ ఫీస్ట్‌

31 May 2024, 6:15 IST

google News
  • Gangs of Godavari Twitter Review: విశ్వ‌క్ సేన్, నేహాశెట్టి జంట‌గా న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మాస్ యాక్ష‌న్ మూవీకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి  ట్విట్టర్ రివ్యూ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ట్విట్టర్ రివ్యూ

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ట్విట్టర్ రివ్యూ

Gangs of Godavari Twitter Review: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ ఈ శుక్ర‌వారం (నేడు) రిలీజ్ అయ్యింది కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యాన‌ర్‌ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీని నిర్మించింది. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

మాస్ ఫీస్ట్‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మాస్ ఫీస్ట్ అని విశ్వ‌క్‌సేన్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. లంక గ్రామాల్లోని హింస‌పై పోరాడిన ఓ యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు చెబుతున్నారు.. విశ్వ‌క్‌సేన్ వాయిస్ ఓవ‌ర్‌తోనే ఈ మూవీ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు మిగిలిన ఇంట‌ర్వెల్‌ ఫైట్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఆడు మొద‌టి మూడు పోట్లు అమ్మోరికి వ‌దిలేశాడు అయ్యా...లాంటి డైలాగ్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ‌తాయ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

లంక‌ల ర‌త్న...

యాక్ష‌న్‌, కామెడి మిక్స్‌డ్‌గా లంక‌ల‌ ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. విశ్వ‌క్ సేన్‌లోని మాస్ కోణాన్ని కొత్త యాంగిల్‌లో చూపించిన సినిమా ఇద‌ని అంటున్నారు. . బుజ్జి పాత్రలో నేహాశెట్టి న‌ట‌న బాగుంద‌ని, ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ఆమె చూపించిన వేరియేష‌న్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

రేసీ స్క్రీన్‌ప్లే...

యువ‌న్ శంక‌ర్ రాజా బీజీఎమ్ సినిమాకు ప్రాణం పోసింద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి కోసం ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య ఎంచుకున్న పాయింట్ బాగుంద‌ని చెబుతోన్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమాను న‌డిపించాడ‌ని అంటున్నారు. రా అండ్ ర‌స్టిక్‌గా ఈ మూవీ సాగుతుంద‌ని, బ్యాక్‌డ్రాప్‌, మాస్ డైలాగ్స్ బాగున్నాయ‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

సినిమా ఎక్క‌డ బోర్ కొట్ట‌ద‌ని అంటున్నారు. అయితే డైరెక్ష‌న్ కంప్లీట్ ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తోంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. విశ్వ‌క్‌సేన్ నుంచి అభిమానులు ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువ‌గా లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింద‌ని అంటున్నారు. డ్రామా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని చెబుతోన్నారు. ఎలాంటి హై మూవ్‌మెంట్స్ లేకుండా ఫ్లాట్‌సాగుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం