Virupaksha A Certificate: విరూపాక్ష మూవీకి ఎ సర్టిఫికెట్ ఎందుకు.. మేకర్స్ రియాక్షన్ ఇదీ
20 April 2023, 22:27 IST
- Virupaksha A Certificate: విరూపాక్ష మూవీకి ఎ సర్టిఫికెట్ ఎందుకు? ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి తాజాగా మేకర్స్ సమాధానం ఇచ్చారు.
సాయిధరమ్‌తేజ్ విరూపాక్ష
Virupaksha A Certificate: టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ విరూపాక్ష. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 21) రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీమ్ గురువారం (ఏప్రిల్ 20) హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విరూపాక్ష మూవీకి ఎ సర్టిఫికెట్ రావడంపై మేకర్స్ స్పందించారు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ సీన్ల వల్ల ఈ సర్టిఫికెట్ ఇచ్చారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు లేవని స్పష్టం చేశాడు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని అన్నాడు. అయితే మూవీలో కొన్ని వెన్నులో వణుకు పుట్టించే సీన్లు, హింస ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు డైరెక్టర్ కార్తీక్ దండు వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా దీనిపై స్పందించాడు.
మగధీర సినిమా గురించి ప్రస్తావించాడు. ఆ సినిమాకు కూడా ఎ సర్టిఫికెట్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఎ సర్టిఫికెట్ ఇచ్చేది కేవలం సెక్సువల్ కంటెంట్ కోసమే కాదని, కొన్ని యాక్షన్ సీన్ల వల్ల ఇలాంటి సర్టిఫికెట్ వచ్చినట్లు చెప్పాడు.
సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. దీంతో విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేట్లకు మూవీని కొనుగోలు చేస్తున్నారు. నైజాం ప్రాంతంలో సాయితేజ్ మూవీని రూ. 7 కోట్ల వరకు అమ్ముడుపోయిందని ట్రేడ్ వర్గాల అంచనా.
సీడెడ్ ప్రాంతంలో రూ. 3 కోట్ల 70 లక్షలు, ఆంధ్ర ప్రాంతంలో రూ.8 కోట్ల యాబై లక్షలకు కొనుగోలు చేశారట. ఈ రకంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
టాపిక్