తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Vedha Trailer: విక్రమ్‌ వేద ట్రైలర్‌ వచ్చేసింది

Vikram Vedha Trailer: విక్రమ్‌ వేద ట్రైలర్‌ వచ్చేసింది

HT Telugu Desk HT Telugu

08 September 2022, 15:50 IST

google News
    • Vikram Vedha Trailer: విక్రమ్‌ వేద ట్రైలర్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ స్టార్లు హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్రమ్ వేద మూవీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్
విక్రమ్ వేద మూవీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్

విక్రమ్ వేద మూవీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్

Vikram Vedha Trailer: బాలీవుడ్‌లో మచ్‌ అవేటెడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ విక్రమ్‌ వేద ట్రైలర్‌ను గురువారం (సెప్టెంబర్‌ 8) రిలీజ్‌ చేశారు. తమిళంలో 2017లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ విక్రమ్‌ వేదను అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఇందులో హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. ఇప్పటికే టీజర్‌ రాగా.. తాజాగా వచ్చిన ట్రైలర్‌ కూడా సూపర్‌ యాక్షన్‌ సీన్స్‌తో అదరగొడుతోంది.

హృతిక్‌, సైఫ్‌ పోటీ పడి నటించినట్లు ఈ ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. ఈ ట్రైలర్‌ సుమారు మూడు నిమిషాల నిడివి ఉంది. స్టార్టింగ్ ఫ్రేమ్‌లోనే హృతిక్‌, సైఫ్‌ ఎదురెదురుగా నిల్చొని తలపడేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ మంచి, చెడు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాం.. కానీ అది తప్పు అన్న వాయిస్‌ ఓవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు వినిపిస్తుంది.

పోలీస్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌, గ్యాంగ్‌స్టర్‌ వేదగా హృతిక్‌ కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్‌ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉన్నాయి. తమిళంలో మాధవన్‌, విజయ్‌ సేతుపతి నటించగా.. హిందీలో వాళ్ల క్యారెక్టర్లను సైఫ్‌, హృతిక్‌ పోషిస్తున్నారు. ఈ హిందీ రీమేక్‌లో సైఫ్‌ భార్యగా రాధికా ఆప్టే కనిపిస్తోంది. ఈమెనే గ్యాంగ్‌స్టర్‌ వేద లాయర్‌గా కూడా ఉంటుంది.

అయితే మూవీలో హృతిక్‌ హైలైట్‌ కానున్నట్లు గతంలో వచ్చిన టీజర్‌ చూసినా, ఇప్పుడు ట్రైలర్‌ చూసినా స్పష్టమవుతోంది. అతని లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ మూవీని పుష్కర-గాయత్రి డైరెక్ట్‌ చేశారు. తమిళంలోనూ వీళ్లే మూవీని డైరెక్ట్‌ చేయడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన విక్రమ్‌ వేద హిందీలో ఏం చేస్తుందో చూడాలి.

అయితే హృతిక్‌పై ఉన్న వ్యతిరేకతతో ఇప్పటికే ఈ మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు వినిపిస్తోంది. ఇప్పటికే లాల్‌ సింగ్‌ చడ్డా, లైగర్‌లకు ఈ బాయ్‌కాట్‌ ఎఫెక్ట్‌ బాగానే పడింది. తాజాగా బ్రహ్మాస్త్ర కూడా బాయ్‌కాట్‌ ప్రమాదం ఎదుర్కొంటోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం