Hrithik Roshan: విక్రమ్ వేధ టీజర్ వచ్చేసింది.. హృతిక్ అదరగొట్టేశాడుగా..!-hrithik roshan new movie vikram vedha trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hrithik Roshan New Movie Vikram Vedha Trailer Released

Hrithik Roshan: విక్రమ్ వేధ టీజర్ వచ్చేసింది.. హృతిక్ అదరగొట్టేశాడుగా..!

Maragani Govardhan HT Telugu
Aug 24, 2022 12:11 PM IST

హృతిక్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విక్రమ్ వేధ సినిమా టీజర్ విడుదలైంది. తమిళంలో 2017లో సూపర్ హిట్టయిన విక్రమ్ వేధాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైఫ్-హృతిక్ రోషన్
సైఫ్-హృతిక్ రోషన్ (Twitter)

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమాల్లో కనిపించి మూడేళ్లు కావస్తుంది. ఆయన చివరగా 2019లో వచ్చిన వారియర్‌లో నటించారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న హృతిక్.. తాజాగా విక్రమ్ వేధాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రమ్ వేధాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రను పోషించారు. మాతృకను రూపొందించిన పుష్కర్-గాయాత్రీనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ బాలీవుడ్ రీమేక్ టీజర్‌ను ట్విటర్ వేదికగా హృతిక్ షేర్ చేశారు.

ఓ కథను వినండి అంటూ హృతిక్.. విక్రమ్ వేధ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఏక్ కహానీ సునియేనా సర్(ఓ కథను వింటారా సర్) అంటూ హృతిక్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి సైఫ్ అలీ ఖాన్, హృతిక్ మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. హృతిక్ హావాభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కెరీర్‌లో తొలిసారిగా హృతిక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఆద్యంతంగా రసవత్తరంగా సాగింది.

ఈ సినిమాలో సైఫ్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా చేస్తోంది. వీరు కాకుండా రోహిత్ సరఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, టీ సిరీస్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై పుష్కర్-గాయత్రి తెరకెక్కిస్తున్నారు. నీరజ్ పాండే స్క్రీన్ ప్లే రాస్తున్నారు. సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. విశాల్ -శేఖర్ సాంగ్స్ రూపొందించగా.. శామ్ సీఎస్, అరియాన్ మెహదీ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇచ్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్