Merry Christmas Release Date: రెట్రో లుక్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ - మేరీ క్రిస్మస్ రిలీజ్ డేట్ ఫిక్స్
17 July 2023, 14:13 IST
Merry Christmas Release Date: విజయ్ సేతుపతి బాలీవుడ్ మూవీ మేరీ క్రిస్మస్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
మేరీ క్రిస్మస్ మూవీ
Merry Christmas Release Date: విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ మేరీ క్రిస్మస్ రిలీజ్ డేట్‌ను సోమవారం అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని డిసెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెట్రో టైప్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ సీరియల్ లుక్‌లో కనిపిస్తోన్నారు.
వారి మధ్యలో పంజరంలో నుంచి విడుదలై ఎగురుతోన్న పావురం కనిపిస్తోంది. అలాగే అంబాసిడర్ కార్‌తో పాటు జూపిటర్ బేకరీ అనే బోర్డ్‌తో కూడిన బిల్డింగ్ ముందు ఓ వ్యక్తి నిల్చొని కనిపించడం ఆసక్తిని పంచుతోంది. సినిమా మొత్తం ఒక రోజు రాత్రిలో జరిగే కథతో తెరకెక్కుతోన్నట్లు సమాచారం. మేరీ క్రిస్మస్ సినిమాకు అంధాధూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
మేరీ క్రిస్మస్ మూవీతోనే విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాల్సింది. అతడు హిందీలో అంగీకరించిన ఫస్ట్ మూవీ ఇది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో మేరీ క్రిస్మస్ మూడో సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది ముంబైకర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ సేతుపతి.
ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ జవాన్‌లోనూ అతడు కీలక పాత్రలో నటిస్తోన్నాడు. సెప్టెంబర్ 7న జవాన్ మూవీ రిలీజ్ కానుంది. మేరీ క్రిస్మస్ సినిమా బాలీవుడ్‌తో పాటు తమిళంలో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.
టాపిక్