Merry Christmas First Poster: విజయ్ సేతుపతి బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్- హీరోహీరోయిన్లు లేకుండానే పోస్టర్ రిలీజ్
24 December 2022, 18:18 IST
Merry Christmas First Look: విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ జంటగా నటిస్తోన్న మేరీ క్రిస్మస్ ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్ల ఫొటోలు లేకుండా డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేరీ క్రిస్మస్ ఫస్ట్ లుక్
Merry Christmas First Look: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మేరీ క్రిస్మస్ సినిమాతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కత్రినాకైఫ్ (Katrina Kaif )హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేరీ క్రిస్మస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు గాజు గ్లాస్‌లు పగిలిపోయినట్లుగా చూపించారు. వాటిలో నుంచి రక్తం కింద పడుతున్నట్లుగా కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
హీరోహీరోయిన్లు విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ లేకుండానే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆసక్తిని పంచుతోంది. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను తొలుత క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణల వల్ల వచ్చే ఏడాదికి వాయిదాపడింది.
అదే విషయాన్ని గుర్తుచేస్తూ కత్రినాకైఫ్ చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను క్రిస్మస్‌కు ప్రేక్షకలు ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ పెద్ద ట్విస్ట్ జరగడంతో వాయిదాపడింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నాం అంటూ ట్విట్టర్ ద్వారా కత్రినాకైఫ్ వెల్లడించింది.
హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంధాదూన్ తర్వాత శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.