Vijay Rashmika Vacation: అప్పుడు మాల్దీవ్స్.. ఇప్పుడు వియత్నాం.. లవ్ బర్డ్స్ విజయ్, రష్మిక కలిసే వెళ్లారా?
15 January 2024, 9:36 IST
- Vijay Rashmika Vacation: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరో వెకేషన్ కు వెళ్లారా? ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం వియత్నాంలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు తాజాగా కొన్ని ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా
Vijay Rashmika Vacation: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ వార్తల నేపథ్యంలో వీళ్లు మరో వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతేడాది మాల్దీవ్స్ టూర్ కు వెళ్లిన వీళ్లు.. తాజాగా వియత్నాంలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీళ్ల మధ్య ఏదో నడుస్తోందని చాన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నా అటు విజయ్ దేవరకొండగానీ, ఇటు రష్మిక మందన్నాగానీ నోరు విప్పలేదు. వెకేషన్లు, విజయ్ ఇంట్లోనే రష్మిక పండుగ సెలబ్రేషన్స్ అంటూ ఫొటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే వీళ్లు మాత్రం ఎప్పుడూ కలిసి కనిపించకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. మాల్దీవ్స్ టూర్ లాగే ఇప్పుడు వియత్నాం ఫొటోలు కూడా వేర్వేరుగానే బయటకు వచ్చాయి.
ఎంగేజ్మెంట్ పుకార్ల మధ్య..
విజయ్, రష్మిక ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్డ్స్ వియత్నాంలో కనిపించారు. వారం రోజుల కిందట విజయ్ ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు, ఒక రోజు ముందు రష్మిక షేర్ చేసిన ఫొటోలు చూసి వీళ్లిదరూ కలిసి వియత్నాం వెకేషన్ కు వెళ్లినట్లు ఫ్యాన్స్ ఫిక్సవుతున్నారు.
నిజానికి ఈ ఇద్దరూ తాము వియత్నాం వెళ్లినట్లు తమ పోస్టుల్లో ఎక్కడా చెప్పలేదు. అయితే కేవలం బ్యాక్గ్రౌండ్ చూసి పట్టేసుకునే ఫ్యాన్స్.. ఈ ఇద్దరి ఫొటోలను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం (జనవరి 14) రష్మిక కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఆమె వెరైటీ హ్యాట్స్ పెట్టుకొని కనిపించింది. అందులో తనకు బాగా నచ్చినదానిని ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పింది.
అంతకుముందు విజయ్ కూడా తాను డిన్నర్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇవి కూడా వియత్నాంలో దిగినట్లుగానే అనిపిస్తున్నాయి. అప్పట్లో మాల్దీవ్స్ కు కలిసే వెళ్లినా వేర్వేరుగా ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ ను టీజ్ చేసిన ఈ కపుల్.. ఈసారి కూడా అదే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. విజయ్, రష్మిక ఇక ఈ దాగుడుమూతలకు చెక్ పెట్టేసి.. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ అని కూడా తేల్చేశారు. గతేడాది ఖుషీ మూవీ ప్రమోషన్ల సమయంలో తాను కూడా పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్లు విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగా.. విజయ్ తన ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.