తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: ప్రెస్‌మీట్‌లో టేబుల్‌ మీద కాలు పెట్టి కూర్చున్న విజయ్‌.. ఫొటో వైరల్‌

Vijay Deverakonda: ప్రెస్‌మీట్‌లో టేబుల్‌ మీద కాలు పెట్టి కూర్చున్న విజయ్‌.. ఫొటో వైరల్‌

HT Telugu Desk HT Telugu

15 August 2022, 18:06 IST

    • Vijay Deverakonda: లైగర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో టేబుల్‌పై కాళ్లు పెట్టి కూర్చొన్న ఫొటో వైరల్‌ అవుతోంది. అతడు ఇలా ఎందుకు చేశాడో చూడండి.
హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు
హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు

హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు

పైన ఉన్న ఫొటో చూశారు కదా. లైగర్‌ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆ మూవీ హీరో విజయ్‌ దేవరకొండ ఇలా టేబుల్‌పై కాళ్లు పెట్టి కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయంలో అయినా తాను మాట్లాడాలి అనుకున్నది సూటిగా మాట్లాడే, చేయాలనుకున్నది చేసేసే విజయ్‌ దేవరకొండ.. తాజాగా సోమవారం (ఆగస్ట్‌ 15) ప్రెస్‌మీట్‌లోనే ఇలా చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

NNS May 15th Episode: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్​- ఒక్కటైన అమర్​, భాగీ- తప్పించుకున్న సరస్వతి- నిజం తెలుసుకున్న అరుంధతి

Sudigali Sudheer: బుల్లితెర‌పైకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ - కొత్త షోకు గ్రీన్‌సిగ్న‌ల్ - టైటిల్ ఇదే!

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

నిజానికి ప్రెస్‌ మీట్లు, ప్రమోషనల్‌ ఈవెంట్లలో సినిమా వాళ్లు చాలా హుందాగా ఉంటారు. కానీ ఈ రౌడీ బాయ్‌ రూటే సెపరేటు కదా. ఎవరేమనుకున్నా జాన్తా నై అనుకునే టైపు. ఓ జర్నలిస్ట్‌ ఏదో ప్రశ్న అడగటానికి మొహమాటపడుతున్న సమయంలో విజయ్‌ ఇలా కూర్చున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సోమవారం హైదరాబాద్‌లో లైగర్‌ టీమ్‌ మీడియాతో మాట్లాడింది.

ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్‌, అనన్యా పాండే సమాధానాలిస్తున్నారు. ఇంతలో ఓ జర్నలిస్ట్‌ ఏదో ప్రశ్న అడిగాడు. అది విజయ్‌కు సరిగ్గా అర్థం కాలేదు. "మీరు ఫ్రీగా అడగలేకపోతున్రా. అడగండి.. కాలు మీద కాలేసుకొని అడగండి. నేను కూడా అట్లనే కూసుంట" అంటూ విజయ్‌ తన ముందున్న టేబుల్‌పై కాళ్లు పెట్టాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా కాలు మీద కాలేసుకొని ప్రశ్న అడిగాడు. దానికి విజయ్‌ అతనికి వంగి వంగి దండాలు పెడుతూ.. ఇంకెప్పుడూ మీ పేరు మరచిపోను అని అనడం విశేషం. విజయ్‌ అలా టేబుల్‌ మీద కాళ్లు పెట్టుకొని కూర్చోవడంతో అతని పక్కనే ఉన్న అనన్యతోపాటు అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. ఆ మధ్య ముంబైలో జరిగిన లైగర్‌ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా విజయ్‌ మామూలు స్లిప్పర్స్‌ వేసుకొని వెళ్లిన విషయం తెలుసు కదా. ఇది చూసి బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ షాక్‌ తిన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం