తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Guru Ott: విజ‌య్ ఆంటోనీ ల‌వ్‌గురు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది- స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

Love Guru OTT: విజ‌య్ ఆంటోనీ ల‌వ్‌గురు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది- స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

20 April 2024, 6:04 IST

  • Love Guru OTT: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన ల‌వ్ గురు మూవీ త్వ‌ర‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ల‌వ్ గురు తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

విజ‌య్ ఆంటోనీ  ల‌వ్ గురు మూవీ
విజ‌య్ ఆంటోనీ ల‌వ్ గురు మూవీ

విజ‌య్ ఆంటోనీ ల‌వ్ గురు మూవీ

Love Guru OTT: బిచ్చ‌గాడు 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన ల‌వ్‌గురు. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను స్వ‌యంగా విజ‌య్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేశాడు. ఏప్రిల్ 11న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

తెలుగులో ఆహా ఓటీటీలో...

ల‌వ్ గురు సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మే 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో ఈ మూవీ రోమియో పేరుతో రిలీజైంది. త‌మిళ వెర్ష‌న్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. తెలుగులో ఆహా ఓటీటీ, త‌మిళంలో అమెజాన్ ప్రైమ్‌లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. ఏప్రిల్ లాస్ట్‌వీక్‌లో ల‌వ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఫ‌స్ట్ టైమ్ ల‌వ్‌స్టోరీ...

ల‌వ్‌గురు సినిమాలో మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టించింది. హీరోగా విజ‌య్ ఆంటోనీ ఎక్కువ‌గా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌తోనే సినిమాలు చేశాడు. వాటికి భిన్నంగా పూర్తిగా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ల‌వ్‌గురు రూపొందింది. న‌టుడిగా మాత్రం విజ‌య్ ఆంటోనీ ఈ మూవీలో కొత్త‌గా క‌నిపించాడు. కానీ స్టోరీ రొటీన్ కావ‌డంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

ల‌వ్ గురు క‌థ ఇదే...

అర‌వింద్ (విజ‌య్ ఆంటోనీ) ఓ బిజినెస్‌మెన్‌. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా ప్రేమ‌, పెళ్లి లాంటి బంధాల‌కు దూరంగా ఉంటాడు. 35 వ‌య‌సు దాటిన త‌ర్వాత లీలా (మృణాళిని ర‌వి) అనే అమ్మాయితో అర‌వింద్ పెళ్లి జ‌రుగుతుంది. త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతంతోనే అర‌వింద్‌ను పెళ్లిచేసుకుంటుంది లీలా.

హీరోయిన్ కావాల‌న్న‌ది లీలా కోరిక తెలుసుకుంటాడు. లీలా మ‌న‌సుకు గెల‌వ‌డంతో పాటు ఆమె కోరిక తీర్చ‌డం కోసం తానే హీరోగా, నిర్మాత‌గా మారి అర‌వింద్ ఓ సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు? ఆ త‌ర్వాత ఏమైంది? అర‌వింద్ ఆ సినిమా తీశాడా? అర‌వింద్ మంచిత‌నాన్ని గ్ర‌హించిన లీలా అత‌డిని భ‌ర్త‌గా అంగీక‌రించిందా? లేదా? అన్న‌దే ఈ ల‌వ్ గురు మూవీ క‌థ‌.

మినిమం గ్యారెంటీ...

ల‌వ్‌గురు మూవీలో యోగిబాబు, వీటీవీ గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భ‌ర‌త్ ధ‌న్ శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. త‌మిళంలో విజ‌య్ ఆంటోనీ మూవీస్ అంటే మినిమం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం ఉంది.

ఆ న‌మ్మ‌క‌మే అత‌డికి త‌మిళంలో వ‌రుస‌గా అవ‌కావాల‌ను తెచ్చిపెడుతోంది. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా న‌టిస్తూ బిజీగా ఉన్నాడు విజ‌య్ ఆంటోనీ. అగ్ని సిరాగుల్‌, హిట్ల‌ర్‌, ఖాకీ, వాలిమెయిల్ సినిమాలు చేస్తున్నాడు. 2024లోనే ఈ నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌తో

బిచ్చ‌గాడు హిట్‌తో విజ‌య్ ఆంటోనీ తెలుగు ఆడియెన్స్‌కు చేరువ‌య్యాడు. అప్ప‌టినుంచి అత‌డి ప్ర‌తి త‌మిళ సినిమా తెలుగులోకి డ‌బ్ అవుతూ వ‌స్తోంది. బిచ్చ‌గాడు 2 కూడా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. మ‌రోవైపు వ‌రుణ్ తేజ్ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌తో మృణాళిని ర‌వి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో మామ‌మ‌శ్చీంద్ర‌, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలు చేసింది. ఎక్కువ‌గా కోలీవుడ్‌పైనే ఫోక‌స్ పెడుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం