Bichagadu Re Release Date: మరోసారి థియేటర్లలోకి మదర్ సెంటిమెంట్ మూవీ బిచ్చగాడు - రీ రిలీజ్ డేట్ ఫిక్స్
Bichagadu Re Release Date: విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మూవీ మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.
Bichagadu Re Release Date: విజయ్ ఆంటోనీ సూపర్ హిట్ మూవీ బిచ్చగాడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. వినాయకచవితి రేసులో నిలిచిన పెద్ద సినిమాలు వాయిదాపడటంతో ఈ పండుగ క్రేజ్‌ను బిచ్చగాడు రీ రిలీజ్‌తో క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రీ రిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. ఆ సెంటిమెంట్ బిచ్చగాడు సినిమాకు వర్కవుట్ అవుతుందనే ఆలోచనతోనే సెప్టెంబర్ 15న ఈ మూవీని రిలీజ్ చేస్తోన్నట్లు సమాచారం. 2016లో తమిళంలో రూపొందిన పిచ్చైకారన్ సినిమాకు అనువాదంగా బిచ్చగాడు తెలుగులో రిలీజైంది.
మదర్ సెంటిమెంట్‌కు ఆడియెన్స్ కనెక్ట్ కావడంతో బిచ్చగాడు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను పడించింది. ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. హీరోగా అతడికి మార్కెట్ ఏర్పడింది.
మరణం నుంచి తన తల్లిని కాపాడుకోవడానికి 48 రోజుల పాటు బిచ్చగాడిగా జీవితాన్ని గడిపే ఓ మల్టీమిలయనీర్ కథతో దర్శకుడు శశి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు హీరోగా, ప్రొడ్యూసర్‌గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా విజయ్ ఆంటోనీ వ్యవహరించాడు.
విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా బిచ్చగాడు నిలిచింది. ఈ సినిమాలో సాట్నా టైటాస్ హీరోయిన్‌గా నటించింది. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా స్వీయ దర్శకత్వంలో ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాను తెరకెక్కించారు విజయ్ ఆంటోనీ.