Vijay Antony Vikram Rathod: విక్ర‌మ్ రాథోడ్‌గా రానున్న విజ‌య్ ఆంటోనీ - రిలీజ్ డేట్ ఫిక్స్‌!-vijay antony vikram rathode release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Antony Vikram Rathod: విక్ర‌మ్ రాథోడ్‌గా రానున్న విజ‌య్ ఆంటోనీ - రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Vijay Antony Vikram Rathod: విక్ర‌మ్ రాథోడ్‌గా రానున్న విజ‌య్ ఆంటోనీ - రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Nov 24, 2023 04:18 PM IST

Vijay Antony Vikram Rathod: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన విక్ర‌మ్ రాథోడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

విజ‌య్ ఆంటోనీ  విక్ర‌మ్ రాథోడ్
విజ‌య్ ఆంటోనీ విక్ర‌మ్ రాథోడ్

Vijay Antony Vikram Rathod: ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విక్ర‌మార్కుడు సినిమాలో ర‌వితేజ విక్ర‌మ్ రాథోడ్ అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు. రాజ‌మౌళి కార‌ణంగా ఈ పేరు ఫేమ‌స్ అయ్యింది. తాజాగా విక్ర‌మ్ రాథోడ్ పేరుతో విజ‌య్ ఆంటోనీ ఓ సినిమా చేశారు. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. బాబు యోగేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించాడు.

సురేష్ గోపీ, ర‌మ్య నంబీష‌న్‌, సోనుసూద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కోలీవుడ్ మూవీ త‌మిళ‌రాస‌న్‌కు డబ్బింగ్ గా విక్ర‌మ్ రాథోడ్ మూవీ రిలీజ్ అవుతోంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌తో ప్రాణాల‌తో పోరాడుతోన్న త‌న కొడుకును కాపాడుకోవ‌డానికి ఓ పోలీస్ ఆఫీస‌ర్ చేసిన పోరాటం నేప‌థ్యంలో విక్ర‌మ్ రాథోడ్ మూవీ తెర‌కెక్క‌నుంది. ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌ను ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఎందుకు హైజాక్ చేశాడు?

ఆ పోలీస్‌పై ప‌గ‌తో క‌మీష‌న‌ర్ ర‌గిలిపోవ‌డానికి కార‌ణం ఏమిట‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. త‌మిళంలో ఏప్రిల్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ ఏడాది విజ‌య్ ఆంటోనీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బిచ్చ‌గాడు 2తోపాటు ర‌త్తం, హ‌త్య‌, త‌మిళ‌రాస‌న్ సినిమాలు చేశాడు విజ‌య్ ఆంటోనీ. వీటిలో బిచ్చ‌గాడు 2, ర‌త్తం క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యాల్ని అందుకున్నాయి.