Vettaiyan Collections: వేట్టయన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ - 200 కోట్లు దాటిన రజనీకాంత్ మూవీ - అయినా బ్రేక్ ఈవెన్ కాలేదు!
17 October 2024, 14:12 IST
Vettaiyan Collections: రజనీకాంత్ వేట్టయన్ మూవీ ఫస్ట్ వీక్‌లో 210 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 60 శాతం రికవరీని సాధించినట్లు తెలిసింది. రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 55 కోట్లకుపైనే కలెక్షన్స్ సాధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
వేట్టయన్ కలెక్షన్స్
రజనీకాంత్ వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. వారం రోజుల్లో 210 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. 250 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతుంది. అయితే బుధవారం రోజు వేట్టయన్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇండియావైడ్‌గా ఈ మూవీ 4.25 కోట్ల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నది. తెలుగు వెర్షన్‌కు 38 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్...
ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల మార్కును దాటినా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వరల్డ్ వైడ్‌గా వేట్టయన్ మూవీ 160 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రజనీకాంత్ మూవీ రిలీజైంది. ఫస్ట్ వీక్‌లో 210 కోట్ గ్రాస్ కలెక్షన్స్ 105 కోట్ల వరకు షేర్ వసూళ్లను వేట్టయన్ మూవీ రాబట్టింది. వేట్టయన్ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో 57 కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
తమిళంలో హయ్యెస్ట్..
తమిళనాడులో అత్యధికంగా 85 కోట్ల వరకు వేట్టయన్‌కు కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్‌సీస్‌లో 70 కోట్లు, తెలుగులో 18 కోట్ల వరకు రజనీకాంత్ మూవీ కలెక్షన్స్ దక్కించుకుంది.
ఎనిమిదిన్నర కోట్లు...
తెలుగులోనూ వేట్టయన్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోనట్లు సమాచారం. వేట్టయన్ తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18 కోట్ల వరకు గ్రాస్...తొమ్మిది కోట్ల యాభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. తొలిరోజు రెండు కోట్ల డెబ్భై లక్షలతో సత్తా చాటింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బాగున్నా...వీక్‌డేస్‌లో మూవీ పూర్తిగా డల్ అయిపోయింది.
పద్దెనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో ఈ మూవీ రిలీజైంది. తెలుగు నిర్మాతలు లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో ఎనిమిదిన్నర కోట్లకుపై కలెక్షన్స్ రావాలని వార్తలు వినిపిస్తోన్నాయి.
సందేశంతో...
వేట్టయన్ మూవీకి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహించాడు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. పోలీసులు హంటర్స్‌గా కాకుండా సమాజానికి ప్రొటెక్టర్స్‌గా ఉండాలనే సందేశంతో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు.
అంతర్లీనంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన ఓ మెసేజ్‌ను మూవీలో చర్చించాడు డైరెక్టర్ ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతోన్నాయి.
వేట్టయన్ కథ ఇదే..
అథియన్ (రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లను ఎన్‌కౌంటర్ లో లేపేస్తుంటాడు. శరణ్య (దుషారా విజయన్) అనే స్కూల్ టీచర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గంజాయి ముఠా నాయకుడిని చంపేస్తాడు అథియన్. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్యను గుర్తు తెలియని వ్యక్తి రేప్ చేసి హతమార్చుతాడు. ఈ కేసులో అథియన్... గుణ అనే యువకుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు.
అథియన్ చేసిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సత్యదేవ్ పాండే (అమితాబ్‌బచ్చన్) ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటుచేస్తారు. విచారణ కమిటీ ఏం తేల్చింది? అథియన్ చేసిన ఎన్‌కౌంటర్ సరైందేనా? అథియన్ సిద్ధాంతాన్ని సత్యదేవ్ ఎందుకు వ్యతిరేకించాడు? శరణ్య మర్డర్ కేసులోకి ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్(రానా దగ్గుబాటి), ఎలా వచ్చారు అన్నదే వేట్టయన్ మూవీ కథ.