OTT Action Thriller: తెలుగులోకి వ‌స్తోన్న మ్యాడ్ హీరోయిన్ కోలీవుడ్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?-tamil action thriller movie raid telugu version to stream on aha ott from october 19th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: తెలుగులోకి వ‌స్తోన్న మ్యాడ్ హీరోయిన్ కోలీవుడ్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

OTT Action Thriller: తెలుగులోకి వ‌స్తోన్న మ్యాడ్ హీరోయిన్ కోలీవుడ్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Published Oct 17, 2024 08:23 AM IST

OTT Action Thriller: మ్యాడ్ ఫేమ్‌ అనంతిక స‌నీల్‌కుమార్‌హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ రైడ్ తెలుగులోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 19 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించాడు.

యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ
యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ

OTT Action Thriller: మ్యాడ్ మూవీతో తెలుగులో తొలి అడుగులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న‌ది అనంతిక స‌నీల్‌కుమార్‌. ఈ యూత్‌ఫుల్ కామెడీ మూవీలో ఎన్టీఆర్ బావ‌మ‌రిదికి జోడీగా క‌నిపించింది. మ్యాడ్ హిట్‌తో తెలుగులో అనంతిక‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి.

డైరెక్ట్‌గా ఓటీటీలో...

అనంతిక న‌టించిన త‌మిళ మూవీ రైడ్ తెలుగులోకి వ‌స్తోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించాడు. గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ త‌మిళ మూవీలో తెలుగు హీరోయిన్ శ్రీదివ్య మెయిన్ హీరోయిన్‌గా న‌టించింది.

ఆహా ఓటీటీలో...

రైడ్ మూవీ తెలుగులో అదే పేరుతో రిలీజ్ కాబోతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. అక్టోబ‌ర్ 19 నుంచి ఆహా ఓటీటీలో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని చూడొచ్చు.

రైడ్ మూవీ క‌థ ఇదే...

ప్ర‌భాక‌ర‌న్ (విక్ర‌మ్ ప్ర‌భు) నిజాయితీప‌రుడైన‌ పోలీస్ ఆఫీస‌ర్‌. సిటీని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న డాలీ, చిట్టి అనే రౌడీల అక్ర‌మాల‌కు చెక్ పెట్టాల‌ని అనుకుంటాడు ప్ర‌భాక‌ర్‌. ఓ ఎన్‌కౌంట‌ర్‌లో డాలీ త‌మ్ముడిని ప్ర‌భాక‌ర్ చంపేస్తాడు. దాంతో ప్ర‌భాక‌ర‌న్‌పై ప‌గ‌తో ర‌గిలిపోతాడు డాలీ.

అత‌డిని చంపేందుకు ప‌థ‌కం వేస్తాడు. కానీ ఈ ఎటాక్‌లో అనుకోకుండా ప్ర‌భాక‌ర‌న్ భార్య వెంబా (శ్రీదివ్య‌) క‌న్నుమూస్తుంది. త‌న భార్య‌ను చంపిన డాలీతో పాటు అత‌డి గ్యాంగ్‌లోని ఒక్కొక్క‌రిని ప‌ట్టుకుంటూ చంపేస్తుంటాడు ప్ర‌భాక‌ర‌న్‌.

చివ‌ర‌కు డాలీని అత‌డు ఎలా ప‌ట్టుకున్నాడు? ప్ర‌భాక‌ర‌న్‌పై కోపంతో డాలీ కిడ్నాప్ చేసిన వేన్‌మ‌తి (అనంతిక‌) ఎవ‌రు? వేన్‌మ‌తిని ప్ర‌భాక‌ర‌న్ ఎలా కాపాడాడు? డాలీకి ఎలాంటి శిక్ష విధించాడు అన్న‌దే రైడ్ మూవీ క‌థ‌. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌గారు ఆధారంగా రైడ్ మూవీ తెర‌కెక్కింది.

తెలుగు సినిమాలోనే...

రైడ్ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన శ్రీదివ్య కెరీర్ తెలుగుసినిమాల‌తోనే మొద‌లైంది. హ‌నుమాన్ జంక్ష‌న్‌, యువ‌రాజుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. మ‌న‌సారాతో హీరోయిన్‌గా మారింది శ్రీదివ్య‌.

మారుతి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన బ‌స్‌స్టాప్‌తో పాటు కేరింత‌, వార‌ధితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. త‌మిళంలో బెంగ‌ళూరు నాట‌క్క‌ల్‌, పెన్సిల్‌, ఈట్టితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది. ఇటీవ‌ల తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన స‌త్యం సుంద‌రం మూవీలో కార్తి భార్య పాత్ర‌లో శ్రీదివ్య క‌నిపించింది.

8 వసంతాలు...

రైడ్‌లో హీరోయిన్‌గా న‌టించిన అనంతిక స‌నీల్‌కుమార్ ప్ర‌స్తుతం తెలుగులో బిజీ అయిపోయింది. మ్యాడ్‌కు సీక్వెల్‌గా వ‌స్తోన్న మ్యాడ్ 2లో న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న 8 వ‌సంతాలు మూవీలోహీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఫ‌ణీంద్ర న‌రిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేస్తోంది అనంతిక‌.

Whats_app_banner