తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chaari 111: వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’: ఫన్నీగా అనౌన్స్‌మెంట్ వీడియో: చూసేయండి

Chaari 111: వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’: ఫన్నీగా అనౌన్స్‌మెంట్ వీడియో: చూసేయండి

23 August 2023, 15:13 IST

google News
    • Chaari 111: వెన్నెల కిశోర్ హీరోగా ఓ స్పై యాక్షన్ కామెడీ సినిమా రూపొందుతోంది. ఈ ‘చారి 111’ అనౌన్స్‌మెంట్ వీడియో నేడు రిలీజ్ అయింది.
Chaari 11: వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’: ఫన్నీగా అనౌన్స్‌మెంట్ వీడియో
Chaari 11: వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’: ఫన్నీగా అనౌన్స్‌మెంట్ వీడియో

Chaari 11: వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ సినిమా ‘చారి 111’: ఫన్నీగా అనౌన్స్‌మెంట్ వీడియో

Chaari 111: టాలీవుడ్‍లో వెన్నెల కిశోర్ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. కమెడియన్‍గా చాలా సినిమాల్లో నవ్విస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం టాప్ కమెడియన్లలో ముందు వరుసలో ఉన్నారు వెన్నెల కిశోర్. ఇప్పుడు ఆయన హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. స్పై యాక్షన్ కామెడీ జోనర్‌లో ‘చారి 111’ సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నేడు వచ్చింది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. వివరాలివే..

చారి 111 చిత్రంలో స్పై ఏజెంట్‍గా ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. స్పై ఏజెంట్ గా కన్‍ఫ్యూజ్ అవుతూ.. నవ్వించేలా ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా తెలుస్తోంది. కామిక్‍లా ఉన్న ఈ అనౌన్స్‌మెంట్‍ వీడియోకు కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో వివరించారు. కొన్ని పాత్రలను పరిచయం చేశారు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఓ సిటీలో ఓ ప్రమాదం వచ్చిందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి దొరికింది మాత్రం ‘లక్ ఉండి టాలెంట్ లేని.. స్టైల్ ఉండి స్టఫ్ లేని ఒక ట్యూబ్ లైట్ గాడు’ అంటూ వెన్నెల కిశోర్ (‘చారి 111’) పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. డిస్‍ఫంక్షనల్ ఏజెంట్ అంటూ చారి 111 గురించి హింట్ ఇచ్చారు. మొత్తంగా ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

ఈ సినిమాలో ప్రసాద రావుగా మురళీ శర్మ, హీరోయిన్‍గా సంయుక్త విశ్వనాథన్, మహీగా ప్రియామాలిక్ నటిస్తున్నారు. చారి 111 చిత్రానికి ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు.

స్పై యాక్షన్ కామెడీ జోనర్‌లో విభిన్నంగా ఈ చారి 111 వస్తోంది. ఈ సినిమాను బార్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి నిర్మిస్తున్నారు. రిచర్డ్ కెవిన్ ఏ ఎడిటింగ్ చేస్తుండగా.. కషిశ్ గ్రోవర్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

తదుపరి వ్యాసం