తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vaasava Suhaasa Song Released: వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి పాట వచ్చేసింది.. కే విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల

Vaasava Suhaasa Song released: వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి పాట వచ్చేసింది.. కే విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల

23 December 2022, 22:30 IST

google News
    • Vaasava Suhaasa Song released: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమా నుంచి వాసవసుహాస సాంగ్‌ను కళాతపస్వి కే విశ్వనాథ్ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు పాత రోజులు గుర్తుకువస్తున్నాయని తెలిపారు.
వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట
వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట

వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట

Vaasava Suhaasa Song released: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ కథనాయకుడు తాజాగా మరో సినిమాతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదే వినరో భాగ్యము విష్ణు కథ. సినిమా పేరుకు తగినట్లుగానే అచ్చమైన తెలుగు పాటను విడుదల చేసింది చిత్రబృందం . వాసవసుహాస అంటూ సాగే ఈ పాటను కళా తపస్వి కే విశ్వనాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

వాసవ సహాస కమన సుధ.. ద్వారవతీతిరనాడ్వటీవసుధ అంటూ సాగే ఈ పాట ఎంతో రమణీయంగా ఉంది. అచ్చ తెలుగు పాటలు కొరవడుతున్న ఈ రోజుల్లో అచ్చమైన తేనెలొలికే తెలుగు పదాలతో వస్తున్న ఈ పాటను విడుదల చేసిన కే విశ్వనాథ్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తనకు ఈ పాటను చూస్తుంటే పాత రోజులు గుర్తుస్తున్నాయని, వినరో భాగ్యము విష్ణు కథ టైటిల్ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు.

ఈ పాటను ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించాడు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని సమకూర్చాడు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. వినడానికి ఎంతో వినసొంపుగా ఉన్న ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. పూర్తి పాట శనివారం సాయంత్రం 6.19 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర నటిస్తున్నారు. జీఏ2 ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం