Vinaro Bhagyamu Vishnu Katha Release: కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణుకథ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్-kiran abbavaram new movie vinaro bhagyamu vishnu katha release date confirm
Telugu News  /  Entertainment  /  Kiran Abbavaram New Movie Vinaro Bhagyamu Vishnu Katha Release Date Confirm
వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫార్మ్
వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫార్మ్

Vinaro Bhagyamu Vishnu Katha Release: కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణుకథ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

29 October 2022, 21:41 ISTMaragani Govardhan
29 October 2022, 21:41 IST

Vinaro Bhagyamu Vishnu Katha Release: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. గీతా ఆర్ట్స్2 పతాకంపై వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం.

Vinaro Bhagyamu Vishnu Katha Release: భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ"రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి చిత్రాలతో జనాదరణ పొందిన కిరణ్ అబ్బవరం ఇందులో హీరో. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు కిరణ్.

ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర విడుదల తేదీని కన్ఫార్మ్ చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానున్నట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.

సంబంధిత కథనం

టాపిక్