తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Unstoppable 2 Latest Promo: బాలయ్యతో బాహుబలి అల్లరి మాములుగా లేదుగా.. ఇలా డార్లింగ్‌ను ఎప్పుడూ చూసుండరు

Prabhas Unstoppable 2 Latest Promo: బాలయ్యతో బాహుబలి అల్లరి మాములుగా లేదుగా.. ఇలా డార్లింగ్‌ను ఎప్పుడూ చూసుండరు

17 December 2022, 19:35 IST

    • Prabhas Unstoppable 2 Latest Promo: ప్రభాస్ ఛీఫ్ గెస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్2 ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. బాలయ్యతో కలిసి మన డార్లింగ్ సందడి చేశారు. అంతేకాకుండా అనంతరం గోపీచంద్ కూడా వీరితో జత కలిశారు.
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్
అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో సందడి చేసిన ప్రభాస్, గోపీచంద్

Prabhas Unstoppable 2 Latest Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో తన క్రేజ్‌ను విపరీతంగా పెంచుకున్నారు. వచ్చిన గెస్టులతో బాలయ్య చేసే సందడి మాములగా లేదు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లోనూ ఆయన చతురత మరింత పెరిగింది. చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ నుంచి ఇటీవల అల్లు అరవింద్ వరకు ఆయన వారితో వేసిన పంచులు, అల్లరికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే ప్రభాస్‌తో ఎపిసోడ్‌ కూడా పూర్తి చేశారు. ఈ షోలో గోపీచంద్ కూడా రావడం గమనార్హం. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ఈ ప్రోమో వీడియోను గమనిస్తే.. కాసపేస్య గోత్రోభవస్య.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు నామ దేయస్య బహుపరాఖ్ అంటూ డార్లింగ్‌కు ఓ రేంజ్‌లో ఇంట్రడక్షన్ ఇచ్చారు బాలయ్య. అప్పుడు మొదలైన వీరి అల్లరి వీడియో ముగిసేంత వరకు అలాగే కొనసాగింది. ప్రేమగా అడుగుతున్నా.. నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అనగానే.. ప్రభాస్.. సరే డార్లింగ్ సార్ అంటూ నవ్వులు పూయించారు. అనంతరం మొన్నీమధ్య శర్వానంద్ వస్తే.. పెళ్లి ఎప్పుడు అని అడిగా.. ప్రభాస్ తర్వాత అని చెప్పాడు అని బాలయ్య డార్లింగ్‌ను అడుగ్గా.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో అంటూ తప్పించుకున్నారు.

నిన్నొక స్పాట్‌లో పెట్టే గేమ్ ఆడతానమ్మా అని బాలయ్య అనగా.. మీరెలా పెడతారో డిసైడ్ వచ్చాను సార్ అంటూ ప్రభాస్ పంచ్ వేశారు. నీకు నచ్చిన రొమాంటిక్ సీన్ ఏంటో చెప్పు అని బాలయ్య అడుగుతారు. అంతటితో ఆగకుండా శృతిహాసన్‌ను పొగొడుతుంటే చిన్న హర్ట్ అయ్యావ్ కదా.. ప్రభాస్‌తో అనడం, ఇందుకు డార్లింగ్ దండం పెడుతూ ప్రాధేయపడటం ఆసక్తికరంగా అనిపించింది. అనంతరం గోపీచంద్ ఎంట్రీ ఇస్తారు. ఇక వీరిద్దరితో కలిసి బాలయ్య చేసిన సందడి మరింత పెరిగింది. ముగ్గురు కలిసి ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు. 2008లో ఓ అమ్మాయి గురించి గొడవపడ్డారు.. అది ఎవరు అంటూ బాలయ్య అడగడం, ఓరేయ్ నువ్వు చెప్పేయ్ చెప్పేయ్ అంటూ గోపీచంద్‌పై అరవడం ఆసక్తికరంగా అనిపించింది.

అనంతరం రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ముగ్గురు హీరోలు నివాళీ తెలిపారు. పెదనాన్న గారు.. శత్రువు వచ్చిన ముందు భోజనం పెట్టు అంటూ ప్రభాస్ చెప్పడం వినవచ్చు. ఇలా చివర వరకు ఈ ప్రోమో ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముగ్గురు హీరోలు కలిసి ఇలా ఒకే స్క్రీన్‌పై కనిపించడం అభిమానులకు కన్నుల పండుగలా మారింది. ప్రభాస్‌తో బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ను ఆహా వేదికగా డిసెంబరు 30న రానున్నట్లు అన్‌స్టాపబుల్ టీమ్ తెలియజేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం