Pawan Kalyan in Unstoppable: అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో పవన్‌.. ఇద్దరు డైరెక్టర్లతో కలిసి..!-pawan kalyan in unstoppable as the power star ready for the special episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan In Unstoppable: అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో పవన్‌.. ఇద్దరు డైరెక్టర్లతో కలిసి..!

Pawan Kalyan in Unstoppable: అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో పవన్‌.. ఇద్దరు డైరెక్టర్లతో కలిసి..!

HT Telugu Desk HT Telugu
Dec 16, 2022 10:34 AM IST

Pawan Kalyan in Unstoppable: అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో పవన్‌ కల్యాణ్‌ ముచ్చటించనున్నాడు. అయితే ఈ టాక్‌ షోకు పవన్‌ మరో ఇద్దరు డైరెక్టర్లతో కలిసి వస్తున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan in Unstoppable: ఆహా ఓటీటీలో వస్తున్న బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్‌.. పేరుకు తగినట్లే అసలు అడ్డే లేకుండా దూసుకెళ్తోంది. తొలి సీజన్‌ సక్సెస్‌ అయిన తర్వాత రెండో సీజన్‌ను మరింత గ్రాండ్‌గా మొదలుపెట్టారు. ఈసారి పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఈ టాక్‌ షోకు తీసుకొస్తూ అన్‌స్టాపబుల్‌ను మరింత సక్సెస్‌ చేయడంలో ఈ షో నిర్వాహకులు విజయవంతమవుతూనే ఉన్నారు.

ఈ షోకు ఇప్పటికే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వచ్చిన విషయం తెలిసిందే. మాచో హీరో గోపీచంద్‌తో కలిసి ప్రభాస్‌ రాగా.. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌నే అన్‌స్టాపబుల్‌కు తీసుకొస్తున్నారు. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ కోసం త్వరలోనే బాలకృష్ణతో కలిసి పవన్‌ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

అయితే ఈ షోకు పవన్‌ ఒంటరిగా కాకుండా త్రివిక్రమ్‌, క్రిష్‌లతో కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో ప్రధాన ఆకర్షణ పవనే అయినా.. ఈ ఇద్దరు టాలెంటెడ్‌ డైరెక్టర్లతో ఇది మరింత ఆసక్తికరంగా మారనుంది. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణ తనదైన స్టైల్లో ప్రశ్నలు అడుగుతుంటే.. వచ్చిన గెస్ట్‌లు వాటిని ఎంజాయ్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ షోను బాలయ్య బాబు సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నాడు.

సీజన్‌ 2లో ఇప్పటికే ఎన్నో సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఆనందానికి గురి చేశాయి. ఇక ఇప్పుడు పవన్‌ కల్యాణే ఈ షోకు వస్తుండటం అన్‌స్టాపబుల్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు. నందమూరి హీరో ఓ మెగా హీరోని ఇంటర్వ్యూ చేస్తుంటే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఈ ఎపిసోడ్‌ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ముఖ్యంగా పవన్‌ ఇప్పుడు జనసేన అంటూ రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యతో టాక్‌ షో అంటే పొలిటికల్‌గానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ షోలో రాజకీయ సంబంధిత ప్రశ్నలు బాలయ్య అడుగుతాడా? ఒకవేళ అడిగితే పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడు? టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. జనసేన అధినేత పవన్‌ను ప్రశ్నలు అడుగుతారంటేనే ఎక్కడ లేని ఆసక్తి కలుగుతుంది. ఇప్పటికే ఈ షో కోసం నిర్వాహకులు ఓ ప్రశ్నావళిని కూడా తయారు చేసినట్లు సమాచారం.

IPL_Entry_Point