తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Trivikram: ప‌వ‌న్ కోస‌మే ఆ రూల్‌ను త్రివిక్ర‌మ్ ప‌క్క‌న‌పెట్టాడ‌ట - త్రివిక్ర‌మ్ వైఫ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan Trivikram: ప‌వ‌న్ కోస‌మే ఆ రూల్‌ను త్రివిక్ర‌మ్ ప‌క్క‌న‌పెట్టాడ‌ట - త్రివిక్ర‌మ్ వైఫ్ కామెంట్స్ వైరల్

02 April 2023, 13:34 IST

google News
  • Pawan Kalyan Trivikram: ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్ మ‌ధ్య స్నేహం చాలా ఏళ్లుగా కొన‌సాగుతోంది. వారిద్ద‌రి స్నేహంపై త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్

Pawan Kalyan Trivikram: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మ‌ధ్య స్నేహం చాలా ఏళ్లుగా కొన‌సాగుతోంది. ఈ ఇద్ద‌రి స్నేహం సినిమాల‌కు అతీత‌మైన‌ద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. గ‌త కొన్నేళ్లుగా త్రివిక్ర‌మ్‌తోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్నాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్. ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో ప‌వ‌న్ చేస్తోన్న సినిమాల‌కు మాట‌లు, క‌థ‌ప‌ర‌మైన స‌హాయాన్ని తివిక్ర‌మ్ అందిస్తోన్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డ‌టానికి పుస్త‌క‌ప‌ఠ‌నం కూడా ఓ కార‌ణం.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు సాహిత్యంపై ప‌ట్టు పెర‌గడానికి కార‌ణ‌మైన వారిలో త్రివిక్ర‌మ్ కూడా ఒక‌ర‌ని అంటుంటారు. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ స్నేహంపై త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. త‌న ద‌గ్గ‌ర ఉన్న పుస్త‌కాల్ని త్రివిక్ర‌మ్ ఎవ‌రికీ ఇవ్వ‌ర‌ని సాయిసౌజ‌న్య చెప్పింది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడిగితే మాత్రం కాద‌న‌కుండా ఇచ్చేస్తారు. ఒక్క ప‌వ‌న్ విష‌యంలో త్రివిక్ర‌మ్ ఆ రూల్‌ను ప‌క్క‌న‌పెడ‌తార‌ని అన్న‌ది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా త‌మ ఇంటికి వ‌స్తార‌ని, ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌ర‌చిపోయి క‌బుర్ల‌లో మునిగిపోతార‌ని అన్న‌ది. త‌మ ఇంటి భోజ‌నం అంటే ప‌వ‌న్‌కు ఇష్ట‌మ‌ని, ఉప్మా, ఆవ‌కాయ‌, వెజిటేరియ‌న్ వంట‌కాల్ని ఎక్కువ‌గా తింటార‌ని సాయిసౌజ‌న్య చెప్పింది.

ఇంట్లో మ‌నిషిలా క‌లివిడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంటార‌ని పేర్కొన‌ది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌ స్నేహం గురించి సాయిసౌజ‌న్య చేసిన కామెంట్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన‌ బుట్ట‌బొమ్మ‌, సార్ సినిమాల‌కు సాయిసౌజ‌న్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది.

తదుపరి వ్యాసం