తెలుగు న్యూస్  /  Entertainment  /  Trisha On Vijay Vs Ajith Debate Says She Can Not Say Who Is Bigger

Trisha on Vijay vs Ajith: విజయ్‌, అజిత్‌లలో ఎవరు పెద్ద స్టార్‌.. త్రిష ఇచ్చిన సమాధానం ఇదీ

Hari Prasad S HT Telugu

26 December 2022, 16:46 IST

    • Trisha on Vijay vs Ajith: విజయ్‌, అజిత్‌లలో ఎవరు పెద్ద స్టార్‌ అన్న చర్చ, గొడవ ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్‌ నటి త్రిష కూడా దీనిపై స్పందించింది.
త్రిష, విజయ్
త్రిష, విజయ్

త్రిష, విజయ్

Trisha on Vijay vs Ajith: పెద్ద హీరోల అభిమానుల మధ్య గొడవలు సహజమే. తాజాగా తమిళ సూపర్‌ స్టార్లు విజయ్‌, అజిత్‌ అభిమానుల మధ్య ఇప్పుడిదే ఘర్షణ నడుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు ఈసారి సంక్రాంతికి పోటీ పడనున్న విషయం తెలిసిందే. అజిత్‌ మూవీ తునివు జనవరి 11న రిలీజ్‌ కాబోతోంది. విజయ్ వారసుడు మూవీ రిలీజ్‌ డేట్‌ ఇంకా అనౌన్స్‌ చేయకపోయినా.. సంక్రాంతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Recent OTT Releases: 3 తెలుగు సినిమాలు.. 2 బాలీవుడ్ చిత్రాలు.. 2 వెబ్ సిరీస్‍లు.. ఈ వారం ఓటీటీల్లో పండుగే

HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ మూవీ దుమ్మురేపుతుందా?

Chandrabose: భార్య సినిమాకు ఫస్ట్ టైమ్ గెస్ట్‌గా చంద్ర‌బోస్ - శ‌బ‌రి సాంగ్ రిలీజ్ చేసిన ఆస్కార్ విన్న‌ర్‌

Ramayanam: రామాయణం నుంచి లీకైన సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఫొటోలు.. మీరు చూశారా?

అయితే ఈ సినిమాకు తమిళనాడులో థియేటర్లు దొరకడం లేదు. అదే సమయంలో సీఎం స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌.. తునివు మూవీని రిలీజ్‌ చేయబోతున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు ఆ సినిమాకే దక్కాయి. తన సినిమాకు థియేటర్లు లేకపోవడంతో వారసుడు నిర్మాత దిల్‌ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో అజిత్‌ కంటే విజయ్ పెద్ద స్టార్‌ అని, అందువల్ల తన సినిమాకే ఎక్కువ థియేటర్లు ఉండాలని అనడం తీవ్ర దుమారం రేపింది.

అప్పటి నుంచి ఎవరు పెద్ద స్టార్‌ అన్న చర్చ జరుగుతోంది. తాజాగా నటి త్రిష్‌ కూడా దీనిపై స్పందించింది. దళపతి67లో ఆమె విజయ్‌ సరసన నటించనున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ చర్చపై త్రిష స్పందిస్తూ.. "నంబర్స్‌ గేమ్‌ను నేను వ్యక్తిగతంగా అసలు నమ్మను. ఇది కేవలం ఒకరి చివరి సినిమాను బట్టి మాత్రమే లెక్కిస్తారు. చివరి సినిమా హిట్‌ అయితే అతన్నే నంబర్‌ 1 అంటారు. కొన్ని రోజులుగా రిలీజ్‌లు లేకపోతే ఆ స్థానంలో మరొకరు వస్తారు" అని అభిప్రాయపడింది.

విజయ్‌, అజిత్‌ల మధ్య ఒకరికి తాను ఓటు వేయబోనని కూడా స్పష్టం చేసింది. "నేను సినిమాల్లోకి రాక ముందు నుంచే విజయ్‌, అజిత్‌లు సినిమాల్లో ఉన్నారు. ఓ ప్రేక్షకురాలిగా వాళ్ల సినిమాలు చూశాను. వాళ్ల సినిమాలు చూస్తే కలిగే ఆనందం కోసమే ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్తారు. ఈ ఇద్దరు హీరోలకు ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నా కూడా ఈ నంబర్ల గేమ్‌ మనం మొదలుపెట్టిందే. ఇద్దరూ పెద్ద సూపర్‌స్టార్లే. వాళ్లలో ఎవరు పెద్ద అంటే నేనెలా చెప్పగలను" అని త్రిష చెప్పింది.

ఈ మధ్యే పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీలో కనిపించిన త్రిష.. ఇప్పుడదే మూవీ సీక్వెల్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఇక ఆమె బృందా అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.