తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Nominations: రసవత్తరంగా మూడో వారం నామినేషన్లు.. పళ్లెం విసిరేస్తానన్న ఆదిరెడ్డి.. దొబ్బేయ్ అంటూ గీతూ ఫైర్!

Bigg Boss 6 Nominations: రసవత్తరంగా మూడో వారం నామినేషన్లు.. పళ్లెం విసిరేస్తానన్న ఆదిరెడ్డి.. దొబ్బేయ్ అంటూ గీతూ ఫైర్!

20 September 2022, 7:10 IST

google News
    • Bigg Boss 6 Latest Nominations: మూడో వారం ఇంటి నుంచి బయటకు పంపడానికి తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మహమాటంగా చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియలో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు.
బిగ్‌బాస్ 6 తెలుగు నామినేషన్లు
బిగ్‌బాస్ 6 తెలుగు నామినేషన్లు (Instagram)

బిగ్‌బాస్ 6 తెలుగు నామినేషన్లు

Bigg Boss 6 Telugu 3rd week Nominations: బిగ్‌బాస్ సీజన్ 6 ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. గత వారం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో చాలా మంది కంటెస్టెంట్లు చిల్ అవుతూ.. టాస్క్ పెద్దగా ఆడలేదు. దీంతో టీఆర్పీలు ఆశించినంత లేకపోవడంతో షో నిర్వాహకులు వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున చేత గట్టిగానే క్లాస్ పీకించారు. తొమ్మిది మంది సభ్యులు అస్సలు ఆడలేదు అంటూ పక్కన నిలబెట్టారు. అంతేకాకుండా వీరిలో వేస్ట్ ఎవరు అని ఇతర సభ్యలతో స్టాంప్ కూడా వేయించారు. ఫలితంగా డబుల్ ఎలిమినేషన్‌లో శనివారం నాడు షానీ ఇంటి నుంచి బయటకు రాగా.. ఆదివారం ఎపిసోడ్‌లో అభినయ ఎలిమినేట్ అయింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ ఫైర్ అవ్వడంతో ఈ వారం ఆటపై ఆసక్తి రేకెత్తించింది. అయితే నామినేషన్లలో ఈ సారి గొడవలు గట్టిగానే జరుగుతాయనుకుంటే.. కొంత మంది మాత్రం తిరిగి సేఫ్ గేమ్ ఆడుతూ.. నామినేట్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా షోలో వారు లీనమైనట్లు అనిపించలేదు.

మూడో వారం ఇంటి నుంచి బయటకు పంపడానికి తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మహమాటంగా చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యుల మధ్య వాదనలు నడిచాయి. ముందుగా శ్రీ సత్యను నామినేషన్‌ను ప్రారంభించమనగా.. ఆ్మమె ఆరోహి, ఇనాయ సుల్తానాను నామినేట్ చేసింది. తనకు వేస్ట్ అని స్టాంప్ ఇచ్చేటప్పుడు ఆరోహి ఇచ్చిన వివరణ నచ్చలేదని, అలాగే కెప్టెన్ రాజ్ ఇచ్చిన పనిష్మెంట్ చేయకుండా అతడితో వాదన పెట్టుకోవడం నచ్చలేదని స్పష్టం చేసింది. ఇందుకు ఆరోహి కూడా తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అది నాగార్జున గారు ఇచ్చిన ఆదేశమని, 9 మందిలో ఆట నువ్వే పెద్దగా ఆడలేదని తెలిపింది. అలాగే ఇనాయ సుల్తానా, శ్రీ సత్య వాదనలు ఓ రేంజ్‌లో జరిగాయి. నీది సిల్లీ నామినేషన్ అని, నేను వేస్ట్ అనడానికి నా దగ్గర ఓ రీజన్ ఉందని, నన్ను నామినేట్ చేయడానికి నీ దగ్గర కారణమేలేదని, నీది సిల్లీ పాయింట్ అంటూ ఇనాయా.. శ్రీసత్యపై ఫైర్ అయింది. ఇందుకు శ్రీసత్య కూడానాకు గేమ్ ఎలా ఆడాలో తెలుసని, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నువ్వు ఈ హౌస్‌లో చిల్ అవ్వడానికి వచ్చావని, అసలు ఇంట్రస్టే లేనట్లు ఉన్నావని తెలిపింది. ఇందుకు శ్రీ సత్య కూడా గట్టిగా వాదించలేకపోయింది. నాగ్ క్లాస్ పీకినా.. తన తీరు మాత్రం మారలేదని శ్రీసత్యను చూస్తే తెలుస్తోంది.

సుదీప-గీతూ-చంటి వాదన..

అనంతరం గీతూ రాయల్ తను చలాకీ చంటి, సుదీపను నామినేట్ చేసింది. వయస్సుకు గౌరవం ఇవ్వనని గీతూ చెప్పగా.. పదిమందితో ఉన్నప్పుడు సంస్కారంతో నడుచుకోవాలని చంట బదులిచ్చాడు. ఇందుకు కౌంటర్‌గా గీతూ.. నువ్వు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకో ఆ తర్వాత సంస్కారం గురించి మాట్లాడు అని పేర్కొంది. ఇద్దరి మధ్య కాస్త గట్టిగానే వాదన జరిగింది. వీరి మధ్య గొడవ అంత సులభంగా తేలేలా లేదు. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటూ గీతూ మరో నామినేషన్ సుదీపకు చేసింది. ఆ రోజు ఎమోషనలై ఏడ్చిన తర్వాత టిష్యూలను వాడి అక్కడే ఉంచారు. వాటిని మీరు క్లీన్ చేయలేదు. నేను క్లీన్ చేయనప్పుడు మీరు ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అనేది చెప్పలేదు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అంటూ ప్రశ్నించింది. అయితే గీతూపై సుదీప గట్టిగానే స్పందించింది. కొన్ని స్పాట్లు టచ్ చేయలేదని అంటారు.. కానీ నువ్వు టచ్ చేశావు. నా బాధను కూడా నువ్వు ఇలా అనడం సరికాదు.. నా స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రోజు మానసిక స్థితిని బట్టి ఆ విషయం నాకు గుర్తుకు రాలేదు. అంటూ సుదీప ఆమె ఫైర్ అవ్వడమే కాకుండా తన నామినేషన్ అప్పుడు గీతూను తొలుత నామినేట్ చేసింది.

ఇనాయాను దొబ్బేయ్ అన్న గీతూ..

ఇనాయా-గీతూ నామినేషన్ ఈ ఎపిసోడ్‌కు హైలెట్‌గా నిలిచింది. తన ర్యాక్ ఇవ్వకుండా ఉండటమే కాకుండా.. మాట మీద నిలబడలేదని గీతూను నామినేట్ చేసింది ఇనాయా. అంతేకాకుండా ఆమె ఆట సరైన తీరులో లేదని, అది తనకు అస్సలు నచ్చలేదని స్పష్టం చేసింది. ఇందుకు గీతూ కూడా గట్టిగానే ఇనాయాకు కౌంటర్ ఇచ్చింది. నా గేమ్ నాకిష్టం, నా ఇష్టం వచ్చినట్లు ఆడతా అంటూ చురకంటింది. అయితే మధ్యలో ఆమెను మాట్లాడనీయ కుండా ఇనాయా వాదనకు దిగగా.. ముందు ఇక్కడ నుంచి దొబ్బేయ్ అంటూ సహనం కోల్పోయింది. ఇందుకు నువ్వు కూడా దొబ్బేయ్ అంటూ విరుచుకుపడింది. వీరిద్దరీ మధ్య గొడవ గట్టిగానే జరిగింది.

పళ్లెం ఎత్తేస్తా అన్న ఆదిరెడ్డి..

ఈ ఎపిసోడ్‌లో ఇనాయ, ఆదిరెడ్డి ఇద్దరూ కూడా గట్టిగానే వాదనకు దిగారు. మీరు గేమ్ మొత్తం తెలుసుకుని వచ్చారు అని ఇనాయా చెప్పగా.. 105 రోజులు ఉండే హౌస్‌లో గేమ్ తెలుసుకునే వస్తారు కదా. అంటూ ఆదిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బిగ్‌బాస్ అంటే ఓపెన్ బుక్.. ఆ మాత్రం తెలీయకుండా ఎవ్వరూ రారు.. ఒకవేళ మీరు రాకపోతే మీ తప్పు అంటూ గట్టిగా అరిచాడు. కానీ మీరు మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకుని, స్ట్రాటజీతో ఇక్కడకు వచ్చారంటూ ఆదిరెడ్డి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి అతడి మాట్లాడనీయలేదు. దీంతో సహన కోల్పోయిన ఆదిరెడ్డి బిగ్‌బాస్ పళ్తెం ఎత్తేస్తా చెబుతున్నా.. ఆమెకు చెప్పండి అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం తన మరోనామినేషన్ వాసంతికి చేశాడు. వీక్ కంటెస్టెంట్ నామినేషన్‌లోకి రాకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్లే అవకాశముంది, కాబట్టి మీరు ఈ వారం బాగా ఆడి నామినేషన్ ఒత్తిడి గురించి ఎక్స్‌పీరియన్స్ చేస్తారనుకుంటా అంటూ వాసంతిని నామినేట్ చేశాడు.

రేవంత్ నేహాతో పాటు ఆర్జే సూర్యను నామినేట్ చేశాడు. నేను కష్టపడి ఆడి, కెప్టెన్సీ పోటీదారుడిగా అర్హత కోల్పోయినప్పుడు దానం చేశాననకుండా.. ఏమనాలి, కూల్‌గా వదిలేయాలా, ఈ మాత్రం దానికి నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అంటూ ఆర్జే సూర్యను రేవంత్ నామినేట్ చేశాడు. అనంతరం నేహాను నామినేట్ చేస్తూ.. నన్ను కన్నింగ్ అంటూ గత వారం నామినేషన్ ఇచ్చావ్..కదా అని ఆమెను నామినేట్ చేశాడు. స్నేహితులైన శ్రీహాన్, అర్జున్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. కెప్టెన్ రాజ్.. తన మాట వినలేదని ఆరోహిని, గత వారం సేఫ్ రీజన్ ఇచ్చారంటూ బాలాదిత్యను నామినేట్ చేశాడు. ఇక మొత్తంమీద ఈ వారం నామినేషన్లలో బాలాదిత్య, నేహా, గీతూ, రేవంత్, శ్రీహాన్, చలాకీ చంటి, ఆరోహి, వాసంతి, ఇనాయా సుల్తానా కలిపి 9 మంది ఉన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం