Bigg Boss 6 Telugu: కొత్త కెప్టెన్‌గా రాజ‌శేఖ‌ర్ - బిగ్‌బాస్ హౌజ్‌లో సంద‌డి చేసిన సుధీర్‌బాబు, కృతిశెట్టి-bigg boss 6 telugu rajasekhar becomes new captain of the house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Rajasekhar Becomes New Captain Of The House

Bigg Boss 6 Telugu: కొత్త కెప్టెన్‌గా రాజ‌శేఖ‌ర్ - బిగ్‌బాస్ హౌజ్‌లో సంద‌డి చేసిన సుధీర్‌బాబు, కృతిశెట్టి

HT Telugu Desk HT Telugu
Sep 17, 2022 08:48 AM IST

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సెకండ్ వీక్ లో కొత్త కెప్టెన్ గా రాజశేఖర్ ఎంపికయ్యాడు. శుక్రవారం బిగ్ బాస్ హౌజ్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పండి హీరోహీరోయిన్లు సుధీర్ బాబు, కృతిశెట్టి సందడి చేశారు.

రాజశేఖర్
రాజశేఖర్ (rajashekar)

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సెకండ్‌వీక్‌లో కొత్త కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌శేఖ‌ర్ ఎంపిక‌య్యాడు. బిగ్‌బాస్ తొలిరోజు నుంచి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే రాజ‌శేఖ‌ర్ యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయినా అత‌డికి కెప్టెన్ ప‌ద‌వి ద‌క్క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. చంటి, సూర్య‌ల‌లో ఒక‌రు కెప్టెన్ అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ వారికి అవ‌కాశం ద‌క్క‌లేదు. కెప్టెన్ ఎంపిక కోసం బిగ్ బాస్ ఇచ్చిన డీజే టాస్క్‌లో ఎక్కువ ఓట్లు రాజ‌శేఖ‌ర్‌కు ప‌డ్డాయి. హ్యుమానిటీని యూజ్ చేసి రాజ్ గెలిచాడంటూ చంటి ఫ‌న్నీగా కామెంట్స్ చేశాడు.

కానీ బిగ్‌బాస్ హౌజ్‌ను ఎలా న‌డిపిస్తాడు, అంద‌రితో ప‌నిచేయించ‌గ‌ల‌డా లేదా అనే అనుమానం కంటెస్టెంట్స్ లో వ్య‌క్త‌మైంది. త‌న‌కు ఎవ‌రు ఓటు వేయ‌క‌పోవ‌డంపై ఇనాయా ఎమోష‌న‌ల్ అయ్యింది. క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది. ఆమెను చంటి, నేహా ఓదార్చారు. ఇనాయాకు ఒక్క ఓటు వేస్తే ఆమె సంతోషంగా ఫీల‌వుతుంద‌ని రాజ‌శేఖ‌ర్...ఆదిరెడ్డి ద‌గ్గ‌ర‌కు వెళ్లి రిక్వెస్ట్ చేశాడు.

మొత్తం ఆరు ఓట్ల‌లో నాలుగు ఓట్లు రాజ‌శేఖ‌ర్‌కు ప‌డ‌గా నేహా, ఆరోహి మాత్రం ఇనాయాకు ఓటేశారు. రోహిత్ -మ‌రీనా, ఆదిరెడ్డి మాత్రం సూర్య‌కు ఓటేశారు. ఇక్క‌డ ఎవ్వ‌రూ అమాయ‌కులు కాదని, అంద‌రూ తెలివిగా గేమ్ ఆడుతున్నారంటూ ఆదిరెడ్డి కామెంట్స్ చేశాడు.

బిగ్‌బాస్ హౌజ్‌లో క్లోజ్‌నెస్ పెంచుకుంటే గేమ్ ఆడ‌లేమంటూ, అందుకే అంద‌రికి దూరంగా ఉంటున్నానంటూ గీతారాయ‌ల్ పేర్కొన్న‌ది. కెప్టెన్ బాధ్య‌త‌ల్ని రాజ‌శేఖ‌ర్‌కు బాలాదిత్య అప్ప‌గించాడు. కెప్టెన్ బాధ్య‌త‌ల్ని అంతఃక‌ర‌ణ శుద్ధితో పాటిస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ హామీ ఇచ్చాడు.

బిగ్‌బాస్ హౌజ్‌లో సుధీర్‌బాబు కృతిశెట్టి

బిగ్‌బాస్ హౌజ్‌లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హీరోహీరోయిన్లు సుధీర్‌బాబు, కృతిశెట్టి సంద‌డి చేశారు. ఇంటి స‌భ్యుల‌తో ఫేమ‌స్ సినిమా డైలాగ్స్ చెప్పించారు. తొలుత పోకిరి సినిమాలోని డైలాగ్‌ను రేవంత్ చెప్పాడు.

గీతూ రాయ‌ల్ ప్ర‌భాస్ డైలాగ్ చెప్ప‌గా, ఆర్జే సూర్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను డైలాగ్ చెప్పి ఆక‌ట్టుకున్నాడు. గీతా రాయ‌ల్‌ను కూడా ఇమిటేట్ చేసి న‌వ్వుల‌ను పూయించాడు. ఆ తర్వాత వెంకీ సినిమా స్కిట్ ను ఆర్జే సూర్య చేశాడు.

IPL_Entry_Point