Manisharma: మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తల్లి కన్నుమూత
11 September 2022, 18:27 IST
- Manisharma: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి ఆదివారం కన్నుమూసింది.
మణిశర్మ, సరస్వతి (twitter)
మణిశర్మ, సరస్వతి
Manisharma: సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం నెలకొంది. మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసింది. గత కొంతకాలంగా సరస్వతి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
చెన్నైలోని మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసానికి ఆమె భౌతికకాయాన్ని తరలించారు. సోమవారం సరస్వతి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సరస్వతి మృతి పట్ల పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మణిశర్మ టాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు మహతి స్వరసాగర్ కూడా భీష్మ, ఛలో వంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
టాపిక్
మరిన్ని తెలుగు సినిమా న్యూస్, టీవీ సీరియల్స్, ఓటీటీ న్యూస్, మూవీ రివ్యూలు, బాలీవుడ్, హాలీవుడ్ తాజా అప్డేట్స్ చూడండి.