తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ali Appointed Electronic Media Advisor: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ

Ali Appointed Electronic Media Advisor: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ

27 October 2022, 22:23 IST

google News
    • Ali Appointed Electronic Media Advisor: ప్రముఖ కమెడియన్ అలీ(Comedian Ali)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. ఈ పదవీలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ అలీ

Ali Appointed Electronic Media Advisor: ప్రముఖ కమెడియన్ అలీ(Comedian Ali)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవీని ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన అలీకి.. ఏదోక పదవీని సీఎం జగన్ ఇస్తారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే గత మూడేళ్లుగా ఆయనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం అలీకి కీలకమైన పదవీని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆయనను నియమించింది.

మూడేళ్లు పాటు ఎలాంటి పదవీ లేకుండా పార్టీలో ఉన్న అలీకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవీలో ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2019 ఎన్నికల సమయంలో అలీ వైకాపా తరఫున ప్రచారం చేశారు. అయితే అప్పట్లోనే ఆయన ఎమ్మేల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఇవ్వలేదు. అనంతరం రాజ్యసభ సీటైనా ఇస్తారని అనుకున్నారు. కానీ అక్కడ కూడా అలీకి రిక్తహస్తమే మిగిలింది. ఇది కాకుండా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవీపై కూడా ప్రచారం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. అప్పటికే రెండు, మూడు సార్లు అలీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. చివరకు కీలక పదవిని అలీని వరించింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అలీ సన్నిహితంగా ఉండేవారు..కానీ 2019 ఎన్నికల తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. పవన్ కల్యాణ్ బహిరంగంగానే అలీపై విమర్శలు సంధించగా.. అలీ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్‌కు సమాధానమిచ్చారు. దీంతో వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేయలేదు.

తదుపరి వ్యాసం