తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  7:11 Pm Ott: సడెన్‍గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

7:11 PM OTT: సడెన్‍గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

09 September 2023, 10:51 IST

google News
  • 7:11 PM Movie OTT: సినిమాల విషయంలో ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచి విపరీతంగా మారుతుంది. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అది అర్థం చేసుకున్న దర్శకనిర్మాతలు విభిన్న కాన్సెప్టులతో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి లెటెస్ట్ మూవీ 7:11 PM ఓటీటీలోకి వచ్చేసింది.

తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ 7:11 PM
తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ 7:11 PM

తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ 7:11 PM

డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఉవ్విల్లూరుతుంటారు. కానీ, తెలుగులో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ సినిమాలు వచ్చింది మాత్రం చాలా తక్కువ. ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, ఒకే ఒక జీవితం, బింబిసార వంటి సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఇటీవల టైమ్ ట్రావెల్ కథాంశంతో తెలుగులోకి 7:11 PM సినిమా వచ్చింది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

7:11 PM సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ ఓవరాల్‍గా మూవీకి మాత్రం మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ, ప్రముఖ రివ్యూ వెబ్‍సైట్ ఐమ్‍డీబీ మాత్రం దీనికి 7.5 రేటింగ్ ఇచ్చింది. అయితే జూలైలో విడుదలైన ఈ టైమ్ ట్రావెల్ మూవీ 7:11 PM ఓటీటీ గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, సడెన్‍గా ఓటీటీలో ప్రత్యక్షమైంది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి ఫలితం రాబట్టలేకున్నా ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. అందులో ఇలాంటి టైమ్ ట్రావెల్ సినిమాల విషయంలో థియేటర్లలో చాలా మందికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఇలాంటి జోనర్ చిత్రాలను ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి.

ఇదిలా ఉంటే 7:11 PM సినిమాకు చైతు మాదాల దర్శకత్వం వహించగా ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‍పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. దీనికి గ్యాని సంగీతం అందించగా.. శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసింది. మూడు వేరు వేరు కాలాల్లో జరిగే సినిమాగా వచ్చిన 7:11 PMలో సాహస్ పగడాల, దీపికా రెడ్డి, డాక్టర్ భరత్ రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, చరణ్ కురుగొండ, రైజింగ్ రాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తదుపరి వ్యాసం