తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anupama In Tillu Square: డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ ఫిక్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Anupama in Tillu Square: డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ ఫిక్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

11 January 2023, 6:28 IST

    • Anupama in Tillu Square: డీజే టిల్లు‌కు సీక్వెల్‌గా రానున్న టిల్లు స్క్వేర్‌లో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
టిల్లు స్క్వేర్ లో అనుపమ
టిల్లు స్క్వేర్ లో అనుపమ

టిల్లు స్క్వేర్ లో అనుపమ

Anupama in Tillu Square: సిద్ధు జొన్నలగడ్డకు డీజే టిల్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన ఈ సినిమా చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది. సిద్ధు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్(Tillu Square)న తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీపావళికే ఈ సినిమా నుంచి ప్రకటన రాగా.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వెల్లడించింది. అయితే ఇంతలోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుపమ ప్రాజెక్టు నుంంచి వైదొలిగిందని వదంలు వ్యాపించాయి.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

దీంతో ఆమె స్థానంలో పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. హిట్-2తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరీ ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వైదొలిగిందని ఊహాగానాలు వచ్చాయి. ఆమె స్థానంలో శ్రీలీల పేరు కూడా వినిపించింది. కానీ ఆమె కూడా తప్పుకుందని సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరనే హీరోయిన్‌గా చేస్తున్నట్లు స్పష్టత వచ్చింది. ఆమె చేసిన పోస్టుతో అన్ని వార్తలకు చెక్ పడినట్లయింది.

ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టిన అనుపమ.. సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) జుట్టుకు జెల్ రాస్తూ కనిపించింది. అంతేకాకుండా ఇది ప్రత్యామ్నాయ వృత్తి అంటూ సంబంధిత వీడియోను షేర్ చేసింది. దీంతో టిల్లుకు హీరోయిన్‌ ఫిక్సయినట్లు క్లారిటీ వచ్చింది.

డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నరుడా డోనరుడా, అద్భుతం లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఇతడు ఇప్పుడు డీజే టిల్లు 2తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం