Dj Tillu Sequel First Look: డీజే టిల్లు సీక్వెల్ ఫస్ట్ లుక్ ఔట్ - థియేటర్లలోకి వచ్చేది అప్పుడే-dj tillu sequel first look out and release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dj Tillu Sequel First Look Out And Release Date Announced

Dj Tillu Sequel First Look: డీజే టిల్లు సీక్వెల్ ఫస్ట్ లుక్ ఔట్ - థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

Nelki Naresh Kumar HT Telugu
Oct 24, 2022 02:08 PM IST

Dj Tillu Sequel First Look: దీపావళి సందర్భంగా డీజే టిల్లు సీక్వెల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆ అప్డేట్ ఏదంటే...

సిద్ధు జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ

Dj Tillu Sequel First Look: ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పలు విజయవంతమైన సినిమాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ రాబోతున్నాయి. వాటిలో డీజే టిల్లు సీక్వెల్ ఒకటి. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటిగా డీజే టిల్లు నిలిచింది.

ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దాదాపు పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ డీజే టిల్లుకు సీక్వెల్ రూపొందుతోంది.

సోమవారం దీపావళి సందర్భంగా ఈ సీక్వెల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు డీజే టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో ట్రెండీగా సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తున్నాడు. డబుల్ ఫన్, డబుల్ రొమాన్స్ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది.

డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా సీక్వెల్ లో ఆమె స్థానాన్ని అనుపమ పరమేశ్వరన్ తో భర్తీ చేశారు. సీక్వెల్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. డీజే టిల్లు స్క్వేర్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

IPL_Entry_Point