తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hollywood Actors | తెలుగు సినిమాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్లు వీళ్లే!

Hollywood Actors | తెలుగు సినిమాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్లు వీళ్లే!

24 January 2022, 21:33 IST

google News
    • హాలీవుడ్ నటులు తెలుగు తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారుగా.. అని మీరనుకోవచ్చు. కానీ డైరెక్టుగా కొన్ని తెలుగు చిత్రాల్లో కొంతమంది హాలీవుడ్ నటులు కనిపించారు. ఆర్ఆర్ఆర్, నిశ్శబ్దం లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
తెలుగు తెరపై హాలీవుడ్ స్టార్లు
తెలుగు తెరపై హాలీవుడ్ స్టార్లు (Twitter)

తెలుగు తెరపై హాలీవుడ్ స్టార్లు

Hollywood Actors.. తెలుగు సినిమా స్థాయి నానాటికి ఎంతో పెరుగుతోంది. ఇక్కడ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో డైరెక్టుగా విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అంతేకాకుండా మన స్టార్ హీరోలు సైతం పొరుగు భాష ప్రేక్షకులకు అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇదిలా ఉంటే హాలీవుడ్ నటులు తెలుగు తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారుగా.. అని మీరనుకోవచ్చు. కానీ డైరెక్టుగా కొన్ని తెలుగు చిత్రాల్లో కొంతమంది హాలీవుడ్ నటులు కనిపించారు. ఆర్ఆర్ఆర్, నిశ్శబ్దం లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

రే స్టీవెన్సెన్..

జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కాంబినేషన్​లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సెన్ నటించారు. యాక్షన్ పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో ఈ హాలీవుడ్ స్టార్ స్కాట్ అనే ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఈయనతో పాటు తారక్ జోడి ఒలివియా మోరీస్, ఆలిసన్ డూడీ తదితర ఇంగ్లీష్ యాక్టర్లు కనిపించనున్నారు. రే స్టీవెన్సెన్ హాలీవుడ్ కింగ్ ఆర్థర్, పనిషర్, థోర్ సిరీస్, త్రీ మస్కటర్స్ లాంటి చిత్రాల్లో నటించారు.

<p>రే స్టీవెన్సెన్</p>

మైఖేల్ మ్యాడ్సన్

గతేడాది ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్​లో విడుదలైన నిశ్శబ్దం చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ నటించారు. అనుష్క ప్రధాన పాత్రగా రూపొందిన ఈ సినిమాలో ఆయన రిచర్డ్ డికెన్స్ అనే పోలీసు అధికారి పాత్రను పోషించారు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్వింటన్ టారంటినో తెరకెక్కించిన ఛార్మింగ్, కేర్లెస్, టెర్రిఫయింగ్ బాస్టర్డ్స్ లాంటి సినిమాల్లో మైఖేల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవి కాకుండా ఎన్నో టెలివిజన్ సిరీస్​ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

థామస్ జేన్..

1987లోనే ఓ హాలీవుడ్ నటుడు కథానాయకుడుగా తెలుగులో ఓ సినిమా వచ్చింది. అదే పడమటి సంధ్యారాగం. ఈ సినిమాలో ప్రముఖ అమెరికన్ యాక్టర్ థామస్ జేన్ హీరోగా నటించారు. విజయశాంతి హీరోయిన్. ఇది థామస్ కెరీర్​లో తొలి చిత్రం. అనంతరం హాలీవుడ్​లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులర్​ అయ్యాడు. ఈవినింగ్ రాగా ఆఫ్ ద వెస్ట్(1987), బూగీ నైట్స్(1997), డీప్ బ్లూ సీ(1999), హంగ్ సిరీస్(2009-2011) లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

బెంట్లీ మిచమ్..

విలక్షణ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన లిటిల్ జాన్ చిత్రంతో భారతీయ తెరపై కనిపించారు బెంట్లీ మిచమ్. ఈ సినిమా తమిళం, హిందీ, ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అంతేకాకుండా అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ అమెరికన్ యాక్టర్ హాలీవుడ్​లో 40 చిత్రాలు, పలు టీవీ సిరీస్​లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

రచెల్, ఇస్తాబెన్..

సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన వెల్కం ఒబామా అనే చిత్రంలో బ్రిటీష్ నటి రచెల్, ఫ్రెంచ్ ఛైల్డ్ యాక్టర్ ఇస్తాబెన్ నటించారు. ఈ సినిమా తెలుగులో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఇటీవలే హిందీలో విడుదలైన మిమీ ఈ సినిమాకు రీమేక్.

పైన పేర్కొన్న చిత్రాలే కాకుండా పలు తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్​లో చాలా మంది హాలీవుడ్ నటులు నటించారు. ఫైటర్లు, కెమెరామెన్, జడ్జీలు ఇలా చాలా సినిమాల్లో పలువురు హాలీవుడ్ ప్రముఖులు తెలుగు సినిమాలకు తమ సేవలను అందించారు.

తదుపరి వ్యాసం