Vijay Varasudu OTT Platform: రికార్డ్ ధరకు విజయ్ వారసుడు ఓటీటీ రైట్స్ సేల్
12 September 2022, 11:31 IST
Vijay Varasudu OTT Platform: దళపతి విజయ్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న వారసుడు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే డిజిటల్ , శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడం దక్షిణాది వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయ్
Vijay Varasudu OTT Platform: విజయ్ (Thalapathy vijay)వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. రిలీజ్‌కు మరో నాలుగు నెలలు ముందుగానే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వారసుడు డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ 60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తికాకముందే రికార్డ్ ప్రైస్‌కు వారసుడు డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ సొంతం చేసుకోవడం దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను 50 కోట్లకు సన్ టీవీ కొన్నట్లు తెలిసింది. అలాగే ఆడియో రైట్స్‌ను 10 కోట్లకు టీ సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళంలో వారిసు పేరుతో స్ట్రెయిట్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ఖుష్బూ, జయసుధ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు తమిళంలో నిర్మిస్తున్న తొలి స్ట్రెయిట్ సినిమా ఇదే. వారసుడు తర్వాత లోకేష్ కనకరాజ్‌తో విజయ్ తుదపరి సినిమా చేయబోతున్నాడు.